भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 2, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 2

4

పీ ఠి క .

ఇతఁడు గౌడరాజుయొక్క ఆస్థానమునందు వైద్యవిద్వాంసుఁడుగా నుండెననియును, తండ్రి పేరు నారాయణసూరి యనియును, భానుగోత్ర కులీనుఁ డనియును తెలియుచున్నది.

శ్లో. గౌడాధినాథ రసవత్యధికారిపాత్ర నారాయణస్య తనయః సునయోంతరంగాత్ ,
భానోరనుప్రథితలోధ్రవలీకులీనః శ్రీచక్రదత్త ఇహ కర్తృపదాధికారీ.

ఇట్టి ఈగ్రంథమును యథాశక్తి సరళమగు తెలుగుతాత్పర్యముతో ముద్రించి పాఠకుల కుపాయన మిచ్చుచున్నాము. ఇందలి స్థాలీత్యాదులను మన్నించి ఆంధ్రవైద్యలోక మీగ్రంథమునకు తగిన యాదరమిచ్చెద రని విశ్వసించెదము.

ఇదివఱలో తెనుఁగులిపిలో అచ్చుకాని గదనిగ్రహము, వైద్యశతశ్లోకి, అజీర్ణమంజరి, భేషజకల్పము, శార్ఙ్గధరకృతత్రిశతీ, రాజమార్తాండము, రావణకుమారతంత్రము, వృక్షాయుర్వేదము మున్నగు గ్రంథరత్నములఁ బెక్కింటి సుబోధమగు తెనుఁగుతాత్పర్యాదులతో ముద్రించి యున్నాము. యూనానీగ్రంథరత్నమగు ఇలాజుల్ గుర్బా ఆంధ్రమున చక్కఁగ ముద్రించి ప్రచురించినాము. ఇవిగాక అనుపానమంజరి, నాడీజ్ఞానము, లోలంబరాజీయము, శార్ఙ్గధరసంహిత, సుశ్రుతశారీరము, కాలజ్ఞానము, షడ్రసనిఘంటువు మొదలగు వైద్యగ్రంథముల చక్కఁగ సంస్కరించి ప్రచురించియున్నాము. సంస్కృతభాషామయంబులై ఆంధ్రదేశపువైద్యులకుఁ దెలిసికొన నశక్యంబులై యున్న చరకసంహిత, భావప్రకాశిక మున్నగు గ్రంథరాజముల అచిరకాలమున ముద్రించ దలచినాము. ఆంధ్రదేశమున హెచ్చుగ ప్రచారమున యున్నట్టి బసవరాజీయము, వస్తుగుణరత్నాకరము మొదలగు గ్రంథములఁ త్వరలో ప్రకటింపఁబూనుకొని యున్నారము. కావున, సహృదయులు ప్రాచీనవైద్యగ్రంథములన్నియుఁ ద్వరలో బైలువడునట్లు ప్రోత్సాహమును గలుగఁజేయుదురని ప్రార్థన.

ఇట్లు,
వావిళ్ల. రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్,
ప్రకాశకులు.