भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 12, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 12

ముకుందమాల 5 రాగద్వేషములను త్రోసివేయవలయు నని గీతలో చెప్పబడియున్నది. భగవదాజ్ఞానువర్తులైన కులశేఖరులు భగవద్విషయమునగల సుఖమును దెలి యుని జనులకు ఆ సౌఖ్యమును బోధించి తెలిపినందున వారి దేశమున సూర్యోదయము మొదలు పునస్సూర్యోదయ పర్యంతము శ్రీరంగయాత్ర ఘోషింపబడుచుండినది. సాధారణముగ జనులు ఆపదలందే భగవంతుని దలంతురు. యుద్ధ మున జయలక్ష్మిని పొందిన పాండవులు అశ్వమేధయాగ మొనరించిన పిమ్మట శ్రీకృష్ణమూర్తి ద్వారకాపురి కేగదలచి పయనమై పోవునపుడు తన అత్తయగు కుంతీదేవి యొద్ద సెలవు గైకొనుటకై ఆమె కడకేగి నమస్క రించి “అత్తా! నే పోయివచ్చెదను. నీ కేవేని కోరిక లుండు పక్షమున తెలుపుము. ఈడేర్చెద” నని చెప్పెను. అందుల కామె “కృష్ణా! నా పుత్తులకు పూర్వమువలెనే కష్టములు ప్రాప్తించునట్లు అనుగ్రహింపుము. సంసారమున జిక్కి శ్రమపడునపుడే నీవు ఆదరించుటకు వత్తువు. జన్మ రాహిత్యహేతువైన నీ దర్శన మపుడే కలుగుచుండును. సుఖానుభవకాల మున నీ స్మరణ మెట్లు నిలిచి యుండును? సకలకార్యము లాయెను. ఇక పోయివచ్చెద ననెడి నీ పలుకులే నీతో నెడబాటు కలుగు కాలమును దెల్పుచున్నవి--అని కుంతీదేవి యుత్తర మిచ్చెను. విషయ మిట్లుండినను సకలైశ్వర్యసమృద్ధితో గూడియుండిన రాజైన కులశేఖరులు అధికసంపదగల కాలమందును భగవద్భక్తితో మెలంగిరి. ఇదియును గాక కులశేఖరులు సార్థకనాములై కులమునకు భూషణమై యుండిరి. వారు ఇహమునకు ఐశ్వర్యమును, పరమునకు భక్తియు అను భాగ్యములను గలిగియుండిరి. ప్రాప్య పుణ్యకృతాం లోకా నుషిత్వా శాశ్వతీస్సమాః, శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽ భిజాయతే. -- గీత. 6.41 ధ్యానయోగమున సిద్ధిపొందకమునుపే మృతిచెందినవాడు శుచిగల శ్రీమంతుల యిండ్లలో పుట్టును అని చెప్పబడినది. ఆ స్థలమున జన్మిం చుటచేత ధనమదాంధుడై నశింపడా యను సంశయమునకు దశరథ,