मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 8, कुल 167 में से
संदर्भ में पढ़ेंముకుందమాల
ముకుందమాల యనగా, ముకుందస్య మాలా = మోక్షప్రదుడగు ముకుందునికి మాల యని అర్థము. భగవంతునికి పుష్పమాల సమ ర్పించిన నెంత యానంద మగునో అంత యానంద మీ రమణీయ భోగ్యశ్లోకములతో గూడిన మాలను సమర్పించుటచేత కలుగును.
ఈ ముకుందమాల నలువది శ్లోకములు గలిగిన యొక గొప్పగ్రం థము. ఏ గ్రంథము నైనను గొప్పదని భావించి యంగీకరించుటకు
- ప్రతిపాద్య మాహాత్మ్యము, 2. వక్తృమాహాత్మ్యము అను రెండు అంశములు కారణములైయున్నవి. ప్రతిపాద్య మాహాత్మ్యము ఉండవలయు ననగా చెప్పబడిన విషయము శ్రేష్ఠమైనదిగ నుండవలయును. ఎంతటి ఘనుడగు కవి యొనర్చినదైనను విషయము గొప్పది కాదేని ఆ గ్రంథము ఆదరింపబడదు. అదెట్లనిన కాళిదాసు డనేక గ్రంథములను రచించి యుండినను అంబాపరమైన శ్యామలాదండకము ఆదరింపబడినటులు పుష్ప బాణ విలాసము మొదలగు తదితరగ్రంథములు ఆదరింపబడుటలేదు.
వక్తృమాహాత్మ్యముండవలయు ననగా గ్రంథకర్త శ్రేష్ఠుడై యుండ వలయును. ఎంతటి గొప్ప విషయములతో నిండియుండినదైనను వక్త ప్రసిద్ధుడు, పరిశుద్ధుడు కాడేని ఆ గ్రంథము వాసి కెక్క నేరదు. శ్రీరాముడు ప్రతిపాద్యుడైనను వాల్మీకిప్రోక్తమైన రామాయణమునకు గల గౌరవము తదితర కవికృత రామాయణములకు గలిగెనా? కాన ప్రతిపాద్య వక్తృమాహాత్మ్యము లావశ్యకములు.
కులశేఖ రాళ్వారులు కేవలభగవద్విషయమును నలువది శ్లోకములలో వర్ణించి దానినొక మాల గావించి ముకుందునకు సమర్పించిరి. ఈ గ్రంథము ప్రమాణతమ మైనది. ఇక వక్త యెట్టివా డనగా మహానుభావుడు. 2