चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 118, कुल 674 में से
संदर्भ में पढ़ें98 చక్రదత్త—౫. అర్శోరోగాధికారము.
జంతుదష్టం తు తోయేన త్వగ్దోషం ఖదిరాంబునా, మూత్రకృచ్ఛ్రంతు తోయేన హృద్రోగం తైలసంయుతా. 65. ఇంద్రస్వరససంయుక్తా సర్వజ్వరవినాశినీ, మాతులుంగరసేనాథ సద్యశ్శూలహరీ స్మృతా. 66. కపిత్థతిందుకానాం తు రసేన సహమిశ్రితా, విషాణి హన్తి సర్వాణి పానాశనప్రయోగతః. 67. గోశకృద్రససంయుక్తా హన్యా త్కుష్ఠాని సర్వశః, శ్యామాకపాయసహితా జలోదరవినాశినీ. 68. భక్తచ్ఛం దం జనయతి భుక్తస్యోపరి భక్షితా, అక్షిరోగేశు సర్వేషు మధునా ఘృష్యతాం జయేత్. 69. లేహమాత్రేణ నారీణాం సద్యః ప్రదరనా శినీ, వ్యవహారే తథా ద్యూతే సంగ్రామే మృగయాదిషు. 70. సమా లభ్య నరో హ్యేనాం శీఘ్రం విజయ మాప్నుయాత్ .
కరక్కాయలు తాడి ఉసిరిక పంచలవణములు చంగల్వకోష్టు కటుకరోహిణి దేవదారు వాయువిడంగము వేముపండ్లు ముత్తువపులగము తెల్లముత్తువపులగము పసుపు మానిపసుపు ఆదిత్యభక్తి ప్రొద్దుతిరుగుడు వీటినన్నిటిని క్రానుగురసముతోటి నూరి రేగు గింజలంత మాత్రలు చేసి ఒక్కొక్కమాత్రను ప్రతిరోగమునందు వేరువేరుగా వెడి నీళ్ల అనుపానముతో సేవించిన యెడల జఠరాగ్నిని దీపింపఁజేయును. మూలరోగములను పోఁగొట్టును. గంజితో పుచ్చుకొనిన గుల్మరోగములను పోఁగొట్టును. చన్నీళ్ళతోనైన జంతువాయువును పోఁగొట్టును. కాచునీళ్ల తోటి బుచ్చుకొనిన చర్మదోషములను పోఁగొట్టును. మంచినీళ్ళతో పుచ్చుకొనినియెడల మూత్రకృచ్ఛ్రములను పో గొట్టును. తిల తైలముతో బుచ్చుకొనిన హృద్రోగములను పోఁగొట్టును. కొడిసెపాలరసముతో బుచ్చుకొనిన అన్ని విధములయిన జ్వరమును పోఁగొట్టును. మాదీఫలరసము బుచ్చుకొనిన తాత్కాలిక శూలలను పోఁగొట్టును. కాచు తుమికరసములలో చేర్చి బుచ్చుకొనిన అన్ని విధములైన విషములు దిగిపోవును. ఆవు పేడరసముతో బుచ్చుకొనిన అన్ని కుష్ఠులను, తెల్లతెగడకషాయముతో బుచ్చుకొనిన జలోదరములు నశించును. భోజనమైన తరువాత బుచ్చుకొనిన భోజనమందు రుచి కలిగించును. నేత్రరోగము లన్నిటికిని తేనెతో చాది కలికము వేయవలయును. స్త్రీలకు దీనిని సేవించినమాత్రమున ప్రదరరోగములు నశించును. వ్యవహారము జూదము యుద్ధము వేట మొదలైనవానియందు మనుజుఁడు దీనినిసేవించిన త్వరగా విజయము నొందును.
— విజయచూర్ణము. —
శ్లో. త్రికత్రయవచా హింగు పాఠాక్షారనిశాద్వయం. 71