भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 182, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 182

162 చక్రదత్త—౧౦. రాజయక్ష్మాధికారము.

నమును చ్యవనప్రాశమని యందురు. ఇయ్యది విశేషముగా దగ్గులను శ్వాసరోగములను పోగొట్టును. బల ముడిగినవారలు, ముససళ్ళు, పసిపిల్లలు వీరికి అవయవములకు బలము నిచ్చును. స్వరక్షయము బొమ్మునొప్పి కడుపునొప్పి వాతరక్తము దాహము మూత్రదోషము వీర్యదోషము వీనినిపోగొట్టును. ఈయౌషధమును సేవించునప్పుడు అన్నమునునిల్పుదల చేయరాదు. దీనిని సేవించుటచేత ముదుసలియైన చ్యవనమహాముని ప్రాయపువాఁడయ్యెను. ఇయ్యది బుద్ధిని, జ్ఞాపకశక్తిని, కాంతిని, ఆరోగ్యమును, దేహమునకు లాఘవమును, ఇంద్రియనులకు బలమును, సంతోషమును, అగ్నివృద్ధిని, చక్కని కాంతినిచ్చి వాయువుయొక్క క్రిందుమీదులను పోగొట్టి వృద్ధిపొందించును. ఈరసాయనమును సేవించుటచేత ముసలినాఁడును యౌవనమునొందును. కాని కుటీప్రవేశము మాత్ర మవశ్యకార్యము. మఱియును ముసలితనము గల తనపూర్వపురూపును తొలగించుకొని క్రొత్తదియగు యౌవనరూపమును ధరింపఁగలుగును. ఈరసాయములోనికి అనుపానము అగు చెఱకుపాకు దొరకనియెడల చక్కెరను వేసికొనవలయును. మఱియును లేతయుసిరికలను వేయించి వేయవలయును. మఱియును సామాన్యముగా నాల్గవభాగము నీటిలో వస్తువులరసము చేరుచున్నది. ఇయ్యదియే చ్యవనప్రాశ మనఁబడును.

జీవంత్యాదిఘృతము.

శ్లో. జీవంతీం మధుకం ద్రాక్షాం ఫలాని కుటజస్య చ, శఠీ పుష్కరమూలం చ వ్యాఘ్రీం గోక్షురకం బలాం. 59.
నీలోత్పలం తామలకీం త్రాయమాణాం దురాలభాం, పిప్పలీం చ సమం పిష్ట్వా ఘృతం వైద్యో విపాచయేత్. 60.
ఏత ద్వ్యాధిసమూహస్య రోగేశస్య సముత్థితం, రూప మేకాదశవిధం సర్పి రగ్ర్యం వ్యపోహతి. 61.

పాలకూర యష్టిమధుకము ద్రాక్ష కొడిసెపండ్లు కచ్చూరము పుష్కరమూలము నేలములక పల్లేరు చిట్టాముట్టి నల్లకల్వలు నేలయుసిరిక అగరుశాంతి దులదగొండి లేక తిటకసిండ పిప్పళ్ళు ఇవి యన్నియు సమానభాగములుగా తెచ్చి వానియందు నేయిపోసి పక్వము చేయవలయును. ఇయ్యది శ్రేష్ఠమైన ఘృతము. రోగముల గుంపుల నన్నిటిని నశింపఁజేయును. పదునొకండు తెఱఁగులగు క్షయరోగములను కూడ నీజీవంత్యాదిఘృతము నాశనము నొందించును. ఇయ్యది జీవంత్యాదిఘృత మనంబడును.

పిప్పలీఘృతము.

శ్లో. పిప్పలీగుడసంసిద్ధం ఛాగక్షీరయుతం ఘృతం,
ఏత దగ్నివివృద్ధ్యర్థం సర్పి శ్చ క్షయకాసినాం. 62.