चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 208, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్ర తాత్పర్యసహితము. 189
యవానీషాడబము.
శ్లో. యవానీ తింతిడీకం చ నాగరం చామ్లవేతసం, దాడిమం బదరం చామ్లం కార్షికా ణ్యుపకల్పయేత్. 13.
ధాన్యసౌవర్చలాజాజీ వరాంగం చార్ధకార్షికం, పిప్పలీనాం శతం చైకం ద్వే శతే మరిచస్య చ. 14.
శర్కరాయా శ్చ చత్వారి పలా న్యేకత్ర చూర్ణయేత్, జిహ్వావిశోధనం హృద్యం తచ్చూర్ణం భక్తరోచనం. 15.
హృత్పీడాపార్శ్వశూలఘ్నం విబంధానాహనాశనం, కాసశ్వాసహరం గ్రాహి గ్రహణ్యర్షోవికారనుత్. 16.
వామము చింతపండు శొంఠి ఆమ్లవేతసము దానిమ్మ రేగు ఉసిరిక వీటి నన్నిటిని ఒక్కొక్క కర్షము చొప్పున తీసికొనవలయును. ధనియములు సౌవర్చలవణము జీలకఱ్ఱ త్రిఫలములు వీటిని కర్ధముచొప్పునను, పిప్పళ్ళు 100 పలములు, 200 పలములు మిరియములు, చక్కెర నాలుగుపలములు నొకటిగా చేర్చి చూర్ణముచేయవలయును. ఈ చూర్ణము నాలుకను శుద్ధముగా చేయును. సుందరముగా నుంచును. అరోచకము హృదయపీడ పార్శ్వపునొప్పి విబంధము అనాహము దగ్గు గ్రహణి సంగ్రహణి మూలరోగము మున్నగువానిఁ బోఁగొట్టును. మలమును గట్టిపఱచును. ఇయ్యది యవానీషాడబ మనఁబడును.
కలహంసక లేహము.
శ్లో. అష్టాదశ శిగ్రుఫలా న్యథ దశమరిచాని వింశతిశ్చ పిప్పల్యః,
ఆర్ద్రకపలం గుడపలం ప్రస్థత్రయ మారణాళవృక్షస్య. 17.
ఏతద్విడలవణయుతం భుజాహతం సురభిగంధాఢ్యం,
వ్యంజనసహస్రఘాతి జ్ఞేయం కలహంసకం నామ. 18.
మునగవిత్తులు 18 పలములు, మిరియములు 10 పలములు, పిప్పళ్ళు 20 పలములు అల్లము 1 పలము, బెల్లము పలము, గంజి మూడుమానికలు వీటితో బిడాలలవణముచేర్చి తెడ్డుతో చక్కఁగా మంచివాసన వచ్చు వరకు కలియఁబెట్టి వండుచులవంగపుపట్ట ఏలకులు జాపత్రి వీటిచూర్ణమును వేసి సేవించిన యెడలను వేలకొలది వ్యంజనములనుగూడ నశింపఁజేయును. ఇయ్యది కలహంసక మనులేహము.
ఇట్లు చక్రదత్తయందు అరోచకాధికార ప్రకరణము ముగిసెను.