चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 23, कुल 674 में से
संदर्भ में पढ़ें2
చక్రదత్త—౧. జ్వరాధికారము.
నవజ్వరే దివాస్వప్న స్నానాభ్యంగాన్నమైథునమ్,
క్రోధప్రవాతవ్యాయామ కషాయాంశ్చ వివర్జయేత్. 4
మొట్టమొదలను వైద్యుండగువాఁడు రోగమును చక్కఁగా పరీక్షచేయవలయును. ఆపిమ్మట నారోగమునకు తగినయౌషధము నీయవలయును. క్రొత్తగా జ్వరము వచ్చినవాఁడు పగలునిద్దురపోవుట, స్నానముఁజేయుట, తలనంబోకొనుట, భుజించుట, స్త్రీసంగమమునుచేయుట, కోపమునొందుట, వాతము నెక్కువఁజేయుపనులను చేయుట, శరీరపరిశ్రమలనుచేయుట, కషాయమునుద్రాఁగుట మున్నగుపనుల వదలిపెట్టవలయును. ఇచ్చట రోగమును పరీక్షచేయుట యనుమాటకు అర్థ మేమనఁగా—ఎవ్వ్యాధియో యెట్లుఁవచ్చినదో మున్నగునికరములను రోగిని అడిగియును, ఏయేనాడి యేయేవిధముగా నున్నదో స్పర్శముచేతఁ గనుగొనియును, మలమూత్రాదుల చూచియును, రోగముయొక్క స్వభావమును గుర్తింపవలయు నని యెఱుంగునది.—ఇందుకు ప్రమాణము. ‘దర్శనస్పర్శన ప్రశ్నైః పరీక్ష్షేతాథ రోగిణం’ అనుమున్నగు వాక్యములు గలవు.
❧ లంఘనవిధానము — లంఘనావశ్యకత. ❧
శ్లో. జ్వరే లంఘనమేవాదౌ ఉపదిష్ట మృతే జ్వరాత్, క్షయాఁనిలభయక్రోధ కామశోకశ్రమోద్భవాత్. 5. ఆమాశయస్థో హత్వాగ్నిం సామో మార్గాన్ పిధాయయత్, విదధాతి జ్వరం దోష స్తస్మా ల్లంఘన మాచరేత్. 6. అనవస్థితదోషాగ్నేః లంఘనం దోషపాచనం, జ్వరఘ్నం దీపనం కాంక్షారుచిలాఘవకారకమ్. 7. బలాధిష్ఠానమారోగ్యం యదర్థోయం క్రియాక్రమః.
జ్వరవిషయమునందు మొట్టమొదట లంఘనముచేయుటయే మంచిపని యని చెప్పఁబడినది, కాని క్షయచేత వచ్చెడిజ్వరమునకును, వాతముచేతవచ్చెడి జ్వరమునకును, భయము, కోపము, కామము, దుఃఖము, ఒడలు తెలియక పనిచేయుట మున్నగువాని కారణములవచ్చిన జ్వరంబులకును లంఘనమును చేయరాదు.
ఆమముతోకూడినదోషము, ఆమాశయమునందుండి జఠరాగ్నిని చల్లార్చి, శరీరమునందలి మార్గముల నన్నింటిని అడ్డగించుకొని జ్వరమును కలిగించుచున్నది. కావున రోగి లంఘనమును అవశ్యము చేయవలయును.
అనవస్థితదోషుఁడగువానికిని, జఠరాగ్ని దీపనముగా నున్నవానికిని లంఘనముచేయించుట చేత దోషమును పక్వము చేయును. లంఘనము జఠరాగ్నిని దీపింపంజే