चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 26, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్ర తాత్పర్యసహితము. 5
[ దాహజ్వరములకు షడంగపానీయాదులు, మందాగ్ని గలవానికి పానీయకల్పనములు, యవాగూపానీయము, క్షుధితజ్వరునకు పిప్పల్యాది లాజపేయములు, శిరోరోగికి గోక్షురపేయము, కోష్ఠబంధమునకు ద్రాక్షాదిశృతము, పంచమూలయవాగు, మృదుమధ్యాద్యనుపాకముగా యవాగూకల్పనము, మంథపేయాదికల్పనలు, యవాగూకల్పము. ]
శ్లో. ముస్తాపర్పటకోశీర చందనోదీచ్యనాగరైః. 18. శృతం శీతం జలం దద్యాత్ పిపాసాజ్వరశాంతయే, $^{1}$ముఖ్యభేషజసంబంధో నిషిద్ధ స్తరుణే జ్వరే. 19. తోయపేయాదిసంస్కారే నిర్దోషం తేన భేషజం, యదప్సు శృతశీతాసు షడంగాది ప్రయుజ్యతే. 20. కర్షమాత్రం తతో $^{2}$దత్త్వా సాధయేత్ర్పస్థికేఽంభసి, అర్ధశృతం ప్రయోక్తవ్యం పానే పేయాదిసువిధౌ. 21. వమితం లంఘితం కాలే యవాగూభిరుపాచరేత్, యథా స్వౌషధసిద్ధాభిః మండపూర్వాభిరాదితః. 22. లాజపేయాం సుఖజరాం పిప్పలీనాగరై శ్శృతాం, పిబేజ్జ్వరీ జ్వరహరాం క్షుద్వానల్పాగ్ని రాదితః. 23. పేయాం వారక్తశాలీనాం పార్శ్వవస్తిశిరోరుజి, శ్వదంష్ట్రాకంటకారీభ్యాం సిద్ధాం జ్వరహరాం పిబేత్. 24. కోష్ఠే విబద్ధే సరుజి పిబే త్పేయాం శృతాం జ్వరీ, మృద్వీకాపిప్పలీమూల చవ్యచిత్రకనాగరైః 25. పంచమూల్యా లఘీయస్యా గుర్వ్యా తాభ్యాం సహాస్యవా, కణయా యూషపేయాది సాధనం స్యా ద్యథాక్రమం. 26. వాతపిత్తే, వాతకఫే త్రిదోషే శ్లేష్మపిత్తజే, యవాగూ స్యా త్రిదోషఘ్నీ వ్యాఘ్రీ దుస్స్పర్శగోక్షురైః. 27. కర్షార్థం వా కణాశుంఠ్యోః కల్కద్రవ్యస్య వాపలం, వినీయ పాచయే ద్యుక్త్యా వారిప్రస్థేన చాపరాం. 28. షడంగపరిభాషైవ ప్రాయః పేయాదిసంమతా, యవాగూముచితాద్భక్తా చ్చతుర్భాగకృతాం వదేత్. 29.
(షడంగపానీయము) తుంగముస్తెలు, పర్పాటకము, వట్టివేళ్లు, ఎఱ్ఱచందనము, కురువేరు, శొంఠి వీనితోటికషాయమును చేసి దాహజ్వరము పోవుట కీయవలయును. తరుణజ్వరము వచ్చినయెడల ముఖ్యముగా నౌషధము నీయరాదు. తోయ
1 ఈశ్లోకము తెలుగువ్రాతప్రతులలో కానరాదు. 2 'ద్రవ్యం' అని కొందఱి పాఠము: