चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 294, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్రతాత్పర్యసహితము. 275
మాత్ర చొప్పున సేవింపవలయును. యథేష్టముగా భుజించుచు నుండవలయును. ఇయ్యది అమృతతుల్యము. ఆమవాతము ఆఢ్యవాతము మున్నగువానిని క్రిములు గల వ్రణములను ప్లీహము గుల్మము మున్నగువానినిబోఁగొట్టును. అగ్నినిదీపింపఁజేయును. తేజమును బలమును వృద్ధి నొందించును. సంధివాతము మజ్జావాతము మున్నగువానిని పోఁగొట్టును.
❧ సింహనాదగుగ్గులుము. ❧
శ్లో. పలత్రయం కషాయస్య త్రిఫలాయా స్సుచూర్ణితమ్ 30.
సౌగంధికఫలం చైకం కౌశికస్య పలం తథా, కుడవం చిత్ర తైలస్య సర్వ మాదాయ యత్నతః. 31.
పాచయే త్పాకవి ద్వైద్యః పాత్రే లోహమయే దృఢే, హంతి వాతం తథా పిత్తం శ్లేష్మాణం ఖంజపంగుతాం. 32.
శ్వాసం సుదుర్జయం హంతి కాసం పంచవిధం తథా, కుష్ఠాని వాతరక్తం చ గుల్మశూలోదరాణి చ. 33.
ఆమవాతం జయే దేత దపి వైద్యవివర్జితం, ఏతదభ్యాసయోగేన జరాపలితనాశనమ్. 34.
సర్పిః తైలరసోపేత మశ్నీయా చ్ఛాలియష్టికమ్, సింహనాద ఇతి ఖ్యాతో రోగవారణదర్పహా. 35.
వహ్నివృద్ధికరః పుంసాం భాషితో దండపాణినా.
త్రిఫలములకషాయము 3 పలములు, లవంగపుపట్ట యేలకులు జాపత్రి నాగకేసరములు వీటిచూర్ణమును 1 పలము, గుగ్గిలము 1 పలము, చిత్రమూలతైలము 4 పలములు (కుడవము) వీటినిదెచ్చి పాకమును కనిపెట్టుచు గట్టిపాత్రలో పక్వముచేయవలయును. ఇయ్యది వాత పిత్త కఫములను ఖంజ పంగు వాతములను శ్వాసరోగమును అయిదు విధములగు దగ్గులను నశింపఁజేయును. కుష్ఠము వాతరక్తము గుల్మము శూలము ఉదరరోగము అసాధ్యమగు ఆమవాతము వీనినిపోఁగొట్టును. దీనినభ్యసించుటచేత ముసలితనమును తలనైఱియుటయును నశించును. నేయి నూనె మాంసరసములతో వరియన్నమును తినవలయును. ఇది సింహనాదగుగ్గులము. రోగములనెడి ఏనుగులను హరించునట్టిది. పురుషులకు అగ్నిదీపకము. ఇయ్యది దండపాణిచేతఁ జెప్పఁబడినయోగము.
❧ అలంబూషాదిచూర్ణము. ❧
శ్లో. అలంబూషా గోక్షురకా త్రిఫలా నాగరామృతాః. 36.
యథోత్తరం భాగవృద్ధ్యా శ్యామాచూర్ణం చ తత్సమం, పిబే న్మస్తు సురాతక్ర కాంజికోష్ణోదకేన వా. 37.
పీతం జయ త్యామవాతం సశోథం వాతశోణితమ్, త్రికజానురుసన్నిస్తం, జ్వరారోచకనాశనమ్. 38.