भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 49, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 49

28 చక్రదత్త—౧. జ్వరాధికారము.

నున్న కఫము ఎండిపోయినను సంపూర్ణముగా లాగివేయుఁబడును. శరీరముకూడ చులుకనగును. మఱియును కీళ్లుపోటు, కాళ్లులాగుట, మూర్ఛ, దగ్గు, గొంతుక పట్టుకొని పోవుట, ముఖమును కండ్లును బరువెక్కుట, మొద్దుబారుట, వాడిపోవుట మొదలగు నవగుణములను నాశనము నొందించును. ఈచికిత్సను వైద్యుఁడు దోషమునందలి బలాబలములను చక్కఁగాఁ బరికించి నిర్ణయించుకొని తగినయట్టులు ఒకతేప రెండుమాఱులు నాలుగుమాఱులుగూడ చేయవలయును. ఇట్లుచేయుట రోగులగువారికి పరమౌషధ మని తెలియవలయును. మాదిఫలరసమును అల్లపు రసముతో కొంచెము వెచ్చఁగా గాచి యందు లవణత్రయము వేసి వెచ్చఁజేసి యిచ్చినను, సిద్ధపురుషులు విధించిననస్యము నిచ్చినను చాలును. ఈనస్యమువలన కఫము తగ్గును. శిరస్సు కంఠము హృదయము ముఖము వీనియందుపుట్టెడు బాధలు నుపశమించును.

☛ సన్నిపాతమున మధూకసారనస్యము; సైంధవాదినస్యము; అంజన క్రియ. ☚

శ్లో. మధూకసార సింధూత్థ వచోషణ కణా స్సమాః, శ్లక్ష్ణం పిష్ట్వాంభసా నస్యం కుర్యా త్సంజ్ఞాప్రబోధనం. 159.
సైంధవం శ్వేతమరిచం సర్షపం కుష్ఠమేవచ, బస్తమూత్రేణ పిష్టాని నస్యం తంద్రీనివారణం. 160.
శిరీషబీజగోమూత్ర కృష్ణా మరిచ సైంధవైః, అంజనం స్యాత్ప్రబోధాయ సరసోనశిలావచైః. 161.

ఇప్పపండురసమునందు సైంధవలవణము, వస, మిరియములు, పిప్పళ్లు వీనినిసమభాగములను తీసికొని వీటితోనూరి ఆరసమును నస్యవిధిని చేయించినచో స్మృతి కలిగించును. సైంధవలవణము, తెల్ల ఆవాలు, మునగవిత్తులు, చెంగల్వకోష్టు వీనిని మేకయూచ్ఛతోనూరి నస్యము చేయించిన సన్నిపాతమునందలి మ్రాఁగున్నుపోఁగొట్టును. ఇచ్చట కొన్ని ప్రతులలో వత్సమూత్రేణ అనిపాఠము నంగీకరించి, గోవత్సమూత్రముతో నూరి నస్యము చేయఁదగుననిరి. దిరిసెనగింజలు, పిప్పళ్లు, మిరియములు, సైంధవలవణము వీనిని గోమూత్రముతోనూరిగాని, లేక ఉల్లిగడ్డ, మణిశిల, వస వీటితో సిద్ధముఁ జేయఁబడిన యంజనమునుగాని ప్రయోగించిన సన్నిపాతరోగికి చేతనము కలుగును.

☛ అష్టాంగావలేహనము. ☚

శ్లో. కట్ఫలం పౌష్కరం శృంగీ వ్యోషం యాస శ్చ కారవీ.
శ్లక్ష్ణచూర్ణీకృతం చైత న్మధునాసహ లేహయేత్. 162.
ఏషాఽవలేహికా హంతి సన్నిపాతం సుదారుణం, హిక్కాం శ్వాసం చ కాసం చ