भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 576, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 576

556 చక్రదత్త — ౬౨. స్త్రీరోగాధికారము.

గేహధూమపానం గర్భాపకర్షణం, మాతులుంగస్య మూలాని మధుకం
మధుసంయుతం, ఘృతేన సహ పాతవ్యం సుఖం నారీ ప్రసూయతే. 18.
పుటదగ్ధసర్పకంచుక మస్యనామసీకుసుమసారసహితాం జితాక్షీ, ఝడితి
విశల్యా జాయేత గర్భవతాం మూఢగర్భాపి.

నిషబొద్ది లాంగలి అడ్డసరము మయూరకము వీటిని ప్రత్యేకముగానూరి నాభిస్థానమునందు లేపనచేయుటహితము. బొడ్డు వస్తి యోని వీటికి లేపనచేసిన సుఖప్రసవమగును. పరూషకము ముయ్యాకు పొన్న వీటివేళ్లను వేర్వేరుగానూరి లేపనచేసినను బాలకుడు పుట్టును. అడ్డసరపు వేళ్లను మొలలోగట్టిన తక్షణమే ప్రసవించును. విషబొద్దివేరును యోనిపైనుంచికొనిన స్త్రీ ప్రసవకాలమున సుఖముగ ప్రసవించును. ముల్లంగిని యవగంజితోనూరి కాళ్లకు లేపనచేసిన గర్భిణీస్త్రీ శీఘ్రముగా ప్రసవించును. పాముకుబుసమును పుటమువైచి స్నిగ్ధమగుసిరాను తేనెలో కలిపి కన్నుల కంజనముగా వైచినమూఢగర్భముగలదైనను శీఘ్రమే ప్రసవించును.


సుఖప్రసవమునకు మంత్రోదకములు.

శ్లో. గృహంబునా హింగుసింధు పానం గర్భాపకర్షణం. 20.
ఇహాఁమృతం చ సోమ శ్చ చిత్రభాను శ్చ భామిని, ఉచ్చైః శ్రవా
శ్చతురశో మందిరే నివసంతు తే. 21. ఇద మమృత మపాం సముద్ధృ
తం వైభవ లఘుగర్భ మిమం విముంచతు స్త్రీ, తదనల పవనార్క వా
సవాస్తే సహలవణాఁబుధరై రశంతుశాంతిం. 22. ముక్తాః పాశా విపా
శాశ్చ ముక్తా సూర్యేణ రశ్మయః, ముక్త స్సర్వభయా ద్గర్భ ఏహ్యే
హి మారీచ స్వాహా. 23. జలం చ్యవనమంత్రేణ సప్తవారాభిమం
త్రితం, పీత్వా ప్రసూయతే నారీ.

ఇంటినీళ్ళలో ఇంగువ సైంధవలవణము కలిపి త్రాగిన గర్భాపకర్షణమగును. తిప్పతీగ సోమవల్లి చిత్రభాను ఉచ్చైశ్రవము ఓచిన్నదానా! నీయింటిలో నెప్పుడుంచికొనుము జలోద్ధృతము లగు నీయమృతము ద్రావి గర్భమును ప్రసవింపుము. వాయుసూర్యచంద్రులు ఆనీగర్భమును రక్షింతురు గావుత. పిమ్మటముక్తాః పాశా అనుచ్యవన మంత్రముతో నీటిని మంత్రించి త్రాగె నేని స్త్రీ సుఖముగా ప్రసవించును.


గర్భయంత్రాదులు.

శ్లో. దృష్ట్యాచోభయ త్రింశకం. 24. తథోభయపంచదశదర్శన
సుఖసూతికృత్, నారీ జతువసుభిస్సహ, పక్షాదిగష్టాదశభి రేవ ;