भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 623, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 623

ఆంధ్ర తాత్పర్యసహితము. 608

లును గురుపదార్థములును వర్జింపవలయును. పాలు శుక్తము గంజిరసము యావము నీరు గోమూత్రము అనేక విధములగు కషాయములును ఆలోడనార్థమై యుత్తమములగును.

-•[ శిలాజితూద్భవములగు శిలాగుటికలు. ]•-

శ్లో. చరకోక్తశిలాజతునో విధానం సోపస్కరం హ్యేతత్, కాలే తు రవితాపాఢ్యే కృష్ణాయసజా శిలాజతుప్రవరం. 168.

త్రిఫలారససంయుక్తం త్ర్యహ శ్చ శుష్కం పునః శుష్కం, దశమూలస్య చ గుడూచ్యా రసే బలాయా స్తథా పటోలస్య. 169.

మధుకరసైర్గోమూత్రే త్ర్యహం త్ర్యహం భావయేత్క్రమశః, ఏకాహం క్షీరేణ తు త చ్చ పున ర్భావయే చ్ఛుష్కం. 170.

సప్తాహం భావ్యం స్యాత్క్వాథే నైషాం యథాలాభం, కాకోల్యౌ ద్వే మేదే విదారీయుగ్మం శతావరీ ద్రాక్షా. 171.

ఋద్ధియుగర్భ భవీరా ముండితికా జీర కేంశుమత్యౌ చ, రాస్నాపుష్కరచిత్రకదంతీభకణాకలింగచవ్యాబ్దాః. 172.

కటుకాశృంగీ పాఠా ఏతాని పలాంశికాని కార్యాణి, అద్రోణే సాధితానాం రసేన పాదాంశికేన భావ్యాని. 173.

గిరిజ స్యైవం భావితశుద్ధస్య పలాని దశ షట్చ, ద్విపలం చ విశ్వధాత్రీ మాగధికాయాశ్చ మరిచానాం. 174.

చూర్ణం పలం విదార్యా స్తాలీసపలాని చత్వారి, షోడశసితాపలాని చత్వారి ఘృతస్య మాక్షిక స్యాష్టౌ. 175.

తిలతైలస్య ద్విపలం చూర్ణార్థపలాని పంచానాం, త్వక్ క్షీరిపత్రత్వక్ నాగేలానాం చ మిశ్రయిత్వా తు. 176.

గిరిజస్య షోడశపలై ర్గుడికాః కార్యా స్తతోఽక్షసమాః, తాః శుష్కా నవకుంభే జాతీపుష్పాధివాసితే స్థాప్యాః, తాసా మేకా కాలే భక్ష్యా పేయాపి వా సతతం. 177.

చరకమునందుచెప్పబడిన శిలాజిత్తుయొక్క విధానమిట్లు:-- సూర్యుని వేడిమిగల కాలములో కృష్ణాయసమువలన బుట్టిన శిలాజిత్తు శ్రేష్ఠమైనది. త్రిఫలారసముతో చేర్చి మూడురోజు లెండించి. దశమూలములు తిప్పతీగ ముత్తువపులగము చేదుపొట్ల వీటి రసముతో మరల నెండించి మధుకరసము గోమూత్రములలో మూడేసి రోజులును పాలలో నొకరోజు భావనచేసి ఎండిన పిమ్మట ఏడురోజులు కషాయముతో భావన చేయవలయును. రెండు విధములగు కాకోలులు మేదలు విదారులు పిల్లిపీచర ద్రాక్ష ఋద్ధి ఋషభము జీలకఱ్ఱ బ్రాహ్మీసాలపర్ణి గన్నేరాస్నా పుష్కరమూలము దంతీపిప్పళ్లు