मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 117, कुल 167 में से
संदर्भ में पढ़ें110 ముకుందమాల కులశేఖరులు తా మొనర్చిన ముకుందమాల నెల్లవారును తెలిసికొని కడతేరవలయు ననియే తలంపు గలిగియుండిరి. అట్లుండియు క్రింది శ్లోకమున 'మాం పాలయ' -- నన్ను రక్షింపుమని భగవంతునితో విన్నవిం చిరి. స్వామి నన్ను మాత్రమే గాక నావలెనే యెల్లవారిని కాపాడవలయునని ఈ శ్లోకమున విన్నవించుచున్నారు. కులశేఖరులు : భగవంతు డెల్లవారిని కాపాడునా యనిన నతడు భక్తుల అపాయములనెడు పాములకు గరుడమణిగా నున్నాడు. గరుడుని యొక్క స్పర్శచేతను, దర్శనము చేతను సర్పము పోవును. భగవద్దర్శనముచే, స్మరణముచే భక్తుల అపా యములు వీడిపోవును. గరుడమణి యని చెప్పబడు పచ్చను చూపినను పాము పాఱిపోవును. పాము కఱ చిన చోట ఆ మణిని రాచినను విషము విఱిగి పోవును. నీలమేఘశ్యాముడగు స్వామి యొక్క దర్శనము కాగానే భక్తుల సంకటము లనెడు పాములు పాఱిపోవును. అతడు త్రైలోక్యరక్షామణిగా నున్నాడు. మంత్రవాదులు రక్షామణిని కట్టుదురు. ఆ మణిని ధరించినవాడు మాత్రము కాపా డబడును. భగవంతుడన్ననో చరాచరప్రపంచ మందుండు సకలప్రాణులకు రక్షామణిగా నున్నాడు. అందుచేత నెల్లవారిని కాపాడువాడు. మంత్రవాదులు రక్షామణిని కట్టునట్లే ఈ మణిని వసిష్ఠ వామదేవ యాజ్ఞవల్క్యాదులు నారదాదులు కట్టుదురు. ఇట్లు స్తుతింపబడుస్వామి యెట్లున్నా డనిన గోపికల నేత్రములనెడు చాతకములకు మేఘమణిగా నున్నాడు. చాతకపక్షులు మేఘము నెదురు చూచుచు నోరు తెఱచుకొనియుండును. వాన కురిసి నీటి ధారలు పడుచుండగా ఆహారముగ చేసికొనును. నీరుక్రిందపడిన యెడల త్రాగవు.