मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 119, कुल 167 में से
संदर्भ में पढ़ें112 ముకుందమాల భగ. 7.7శ్లోకమట్లు అతని కంటెను పరము, పరతరము లేదని తెలిపినగదా అతని గౌరవమునకు దగియుండును? గోపాలు రనగా దేవతలని యర్థము. గోశబ్దముచేత చెప్పబడు జీవా త్మలను గాపాడువారు గాన గోపాలు రనబడుచున్నారు. దేవాన్ భావయతా౨నేన తే దేవా భావయన్తు వః, పరస్పరం భావయంతః శ్రేయః పర మవాప్స్యథ. భగ. 3.11శ్లోకమున దేవతలు చేతనులను గాపాడుదురని చెప్పబ డెను. అట్టి గోపాలురకు=దేవతలకు, స్వామి చూడామణిగ నున్నాడు. అనగా శిరోభూషణమయి యున్నాడు. ఇట్లగుటచేత గోపాలచూడామణి యనగా మత్తః పరతరం నాన్య త్కించి దస్తి ధనంజయ, మయి సర్వ మిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. భగ. 7అధ్యా. 7శ్లోకమువలె నతడు పరము, పరతరము నను నర్థము సూచింపబడెను. సకలప్రాణులను రక్షించు బ్రహ్మదేవుడు మొదల గువారు ఈశ్వరులు. స్వామి మహేశ్వరుడు. అనగా వారికిని ఈశ్వరుడు. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరమ్, సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాన్తి మృచ్ఛతి. భగ. 5అధ్యా. 29శ్లోకమువలె స్వామి బ్రహ్మాదులకు రక్షకుడు, శిక్ష కుడు. గోపాలచూడామణి యను నర్థమును వ్యక్తపఱచుటకే దేవశిఖామణి యనియును చెప్పబడెను. ఇట్టివాడు మాకు శ్రేయస్సును అనగా నైహికా ముష్మికములను నొసంగు గాక!