मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 124, कुल 167 में से
संदर्भ में पढ़ेंముకుందమాల 117 దుఃఖమొసగు నౌషధము. వైద్యులు వారివారి దేహస్వభావమును, దేశకాల ములను చూచి మందులు మార్చి మార్చి యిచ్చుచుందురు. దానిదానికి దగినట్లు పథ్యముండవలయును. ఈ యౌషధ మన్ననో మూడులోకముల కును ఔషధము. సంజీవని వంటిది. ఇది చేదుగా నుండునా యనిన భక్తులకు మధురముగ, అభక్తులకు చేదుగ నుండును. కామక్రోధాదులచేత మన నోటికి చేదుగ నుండును. అందుకు కృష్ణాషధ సేవ చేయవలయును. తిరుమంగయాళ్వారు ‘వాడినైన్’ అని యానతిచ్చిన రీతిగ జననయౌవన వార్ధకములలో గల అవస్థలను దలచిన యెడల మనము మలమూత్రములతో గూడిన గుంటలో పడియుం డునట్లు తెలియును గదా! ఇట్టి సంసారభయమును పూర్తిగా పోగొట్టగలిగిన శ్రీకృష్ణు డనెడు దివ్యౌషధమును ఓ మనసా! పానము చేయుము. 25 ఆమ్నాయాభ్యసనా న్యరణ్యరుదితం వేదవ్రతా న్యన్వహం మేదశ్ఛేదఫలాని పూర్తవిధయ స్సర్వే హుతం భస్మని, తీర్థానా మవగాహనాని చ గజస్నానం వినా యత్పద ద్వంద్వాంభోరుహసంస్మృతింవిజయతేదేవస్స నారాయణః. యత్=ఏ నారాయణమూర్తి యొక్క, పదద్వంద్వాంభోరుహ=కమ లములవంటి రెండుపాదముల యొక్క, సంస్మృతిం వినా=ధ్యానములు లేక, ఆమ్నాయాభ్యసనాని=వేదముల నభ్యసించుటలు, అరణ్యరుదితం= అడవిలో నేడ్చుట వంటివో, అన్వహం=ప్రతిదినము చేయబడునట్టి, వేద వ్రతాని=వేదమునందు చెప్పబడిన వ్రతములు, మేదశ్ఛేదఫలాని=క్రొవ్వు తరగిపోవుటయే ఫలముగా గలవో, సర్వే=సమస్తమైన, పూర్తవిధయః= గుంటలు, కోనేళ్లు త్రవ్వించుట మొదలగు ధర్మ కార్యములు, భస్మని=బూడి దలో, హుతం=హోమముచేయుట వంటివో, తీర్థానాం=గంగాది పుణ్యన