भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 156, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 156

ముకుందమాల 149 పాలతుంపరలు మీదపడినవి. అవి మేఘశ్యాములుడగు స్వామియందు నక్షత్రములవలె నున్నవి. అందుచేత అందముగ నున్నాడు. అనంతుని మీద శయనించి యున్నాడు. మంచిగాలి, చల్లని పాలతుంపరలు గల మామగారి యిల్లు, మృదువైన పొన్పు కల్గియుండినను భార్యలేకున్న ప్రయోజనము లేదుగదా! స్వామి లక్ష్మీతోనున్నారు. మధువను రాక్షసుని సంహరించినవాడుగాన ఇట్టి సుఖ సమయమందును ఆశ్రితులను మఱవడు. అట్టివానికి నమస్కరించెద నని కులశేఖరు లనిరి. 40 యస్య ప్రియౌ శ్రుతిధరౌ కవిలోకవీరౌ మిత్రే ద్విజన్మవర పద్మశరావ భూతామ్, తేనాంబుజాక్ష చరణాంబుజ షట్పదేన రాజ్ఞా కృతా కృతిరియం కులశేఖరేణ. యస్య=ఏ కులశేఖరులకు, ప్రియౌ=ఇష్టులును, శ్రుతిధరౌ=వేదార్థ ములను చక్కగా నెఱిగినవారును, కవిలోకవీరౌ=కవులలో శ్రేష్ఠులునగు, ద్విజన్మవర, పద్మశరావభూతాం=ద్విజన్మవరుడు, పద్మశరుడు (వాల్మీకి, నమ్మాళ్వార్లు అని పెద్ద లూహించిరి) అను నిరువురు, మిత్రే=మిత్రులౌ, అంబుజాక్షచరణాంబుజ షట్పదేన=కమల పత్రాక్షుడగు శ్రీమన్నారాయణుని పాదారవిందములందు భ్రమరము వంటివాడగు, తేన రాజ్ఞా కులశేఖరేణ=ఆ ప్రభువగు కులశేఖరులచేత, ఇయం కృతిః=ఈ ముకుందమాల యను కావ్యము, కృతా=చేయబడినది. వేదార్థములు లెస్సగా తెలిసినవారును, కవివరేణ్యులును, తన కిష్టు లును, అగు ద్విజన్మవరుడు, పద్మశరుడు అను నిరువురు ఏ కులశేఖరులకు మిత్రులైయుండిరో ఆ మహాప్రభువగు కులశేఖరులచేత ఈ ముకుందమాల యను కృతి రచింపబడినది.