मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 44, कुल 167 में से
संदर्भ में पढ़ेंముకుందమాల 37 ధర్మే = పుణ్యసంపాదనమునందు, ఆస్థా = ఆసక్తి(మమ = నాకు) న = (అస్తి) లేదు, వసునిచయే = ధనరాశియందు, కామోపభోగే = సంసారమునం దలి స్త్రీసుఖముల ననుభవించుటయందును, ఆస్థా = ఆసక్తి, మమ = నాకు, న (అస్తి) ఏవ = లేనేలేదు, భగవన్ = ఓ పరమాత్మా, యత్ యత్ = ఏది యేది, భవ్యమ్ = కావలసియున్నదో (తత్తత్ = అది యది), పూర్వ కర్మానురూపం = ముందటి జన్మమునందలి పాపపుణ్యకర్మములకు తగినట్టిదిగా, భవతు = అగుగాక, జన్మజన్మాంతరేఽపి = ప్రతిజన్మమునం దును, త్వత్ = మీ, పాదాంభోరుహ = కమలములవంటి చరణముల యొక్క, యుగ = జంటను, గతా = పొందిన, నిశ్చలా = దృఢమైన, భక్తిః = అను రాగము, అస్తు = కలుగుగాక (ఇతి = అని), ఏతత్ = ఇదే, ప్రార్థ్యం = కోరదగి నది, మమ = నాకు, బహుమతమ్ = మిక్కిలి యిష్టమైనది. స్వామీ! ధర్మము, నిక్షిప్తధనముమీద నాకు అపేక్షలేదు. కామాను భవము మీదను ఆశలేదు. పూర్వకర్మానుసారముగ నేదేది కలుగదగినదో అది యంతయు కలుగుగాక. (అయినను) జన్మజన్మాంతరములయందును నీ పాదారవిందద్వయమునందు పొందియున్న భక్తి యన్నది స్థిరముగా నుండవలయును. ఇదినాకు ఇష్టమైనదిగను, కోరదగినదిగను ఉన్నది. స్వామి : కుంభీపాక నరకము తొలగిపోవలయు ననియు, ద్వంద్వము లను త్రోసికొని మోక్షమునకు పోవలయుననియు, స్వర్గము నకు బోయి సుఖపడవలయుననియు నీవు కోరుటలేదు. ఈ లోకమందైనను భార్యాభర్తలయొక్క సుఖమును, పుత్రునివ లని సుఖమును, పదుగురికి అన్నమిడుటచేత గలుగు సుఖ మును వలదంటివి. ఐహికాముష్మికములను వలదనుటకు నీవు పిచ్చివాడవా యేమి? నివృత్తి ధర్మముచేత మోక్షము లభించును. ప్రవృత్తి ధర్మము చేత నింద్రుని కృపగల్గి వర్షము గురిసి, పంటలు పండి తందువలన సుఖము లభించును. కాన ధర్మము వలదా?