भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 96, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 96

ముకుందమాల 89 కూర్చుండి నిశ్చయించు కొనవలెను. తవచరితమపాస్య=నీ చరిత్రమును విడిచి, శ్రావ్యబంధం అన్యదాఖ్యానజాతం=చెవికింపైన ఇతర ప్రబంధములను, మాశ్రౌషం=వినకుందునుగాక (వినుటకు బాగుండినను నీ చరితమును దప్ప ఇతరమును వినకుండవలయును అని యర్థము) లేక అశ్రావ్యబంధం తవ చరిత మపాస్య=చెవికింపుగ నుండని నీ చరిత్రమును విడిచి, అన్యదాఖ్యా నజాతం=ఇతర ప్రబంధములను, మాశ్రౌషం=వినకుందునుగాక (అనగా నీ కథ వినుట కింపుగ లేకపోయినను వినవలయునుగాని, బాగుగ లేదని యిత రపురాణమును వినరాదు అని యర్థము.) లేక శ్రావ్యబంధం తవ చరిత మపాస్య=చెవి కింపైన నీ చరిత్రమును విడిచి, అన్యదాఖ్యానజాతం=ఇతర ప్రబంధములను, మాశ్రౌషం=వినకుందునుగాక. కడతేరవలెననియే కదా యే గ్రంథమునైనను చదువుదురు. కడతేరుమార్గముండెనేని అలంకారము శబ్ద సౌష్ఠవము ఉండ బనిలేదు. దివ్యమంగళనామమును ప్రయోగించి యుండి రేని గ్రంథ మెట్టిదైయుండినను పఠించువారి, వినువారి సకలపాపములను హరించును. భగవత్సంబంధముండు గ్రంథమును వేద మనుకొనవలయును. భగవత్సంబంధములేక, భాగవతసమ్మతము గాక యుండెనేని ప్రయోజనము లేదు. పుష్పసంబంధముచేత నార, రాజాధిరాజుల శిరమున జేరును. ఒక కవి యనిరి:-- “స్వామీ! నాకు సంస్కృతజ్ఞానము లేదు. కవనము చెప్పుటకును శక్తిలేదు. అయినను తెగించి గ్రంథమును వ్రాయబూని తిని. ఈ గ్రంథము నెవ్వ రాదరింతురు? కలకండ చేర్చితిని. అమృతము చేర్చితిని. అందుచేత మెప్పుపొందెను. బావినీటియందు చక్కెర చేర్చి యుండిన పక్షమున ఆ నీటిని యడుగుదురు గాని చక్కెరలేని కావేరి జలము నడుగుదురా? బావినీ రైనను కలకండ పానకమని పేరుపొం దునుగదా! అట్టి గౌరవము కలకండ వలన గలిగెనుగాని నీటియోగ్యతచేత కాదు. ఇత్యాది కారణములచేత కులశేఖరులు భగవంతుని సంబంధములేని కథలను వినగూడదని విన్నవించి మఱియు నిట్లనిరి. కుల : స్వామీ! వీరికంఔను ఇతరపాపు లున్నారు. వారెట్టివా రనగా, పైవారు భగవంతు డున్నాడని తలంచి భక్తి సేయ కుందురు. వారు భగవంతుడు లేడని చెప్పుదురు. ఈ పాపులు