मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 16, कुल 167 में से
संदर्भ में पढ़ेंముకుందమాల 9 అనునట్లు భగవంతుడు సర్వసముడు. భక్తి చేసినటులైన కులశీలా దులను పాటింపడు. సుగ్రీవుడును, విభీషణుడును స్వామి నాశ్రయించి రక్షింపబడిరి. వాలియును, రావణుడును, ఆతని నాశ్రయింపక చెడిరి. కల్పవృక్షమును ఆశ్రయింపనివానిదే తప్పుగును గాని ఆ వృక్షము యొక్క దోష మేమియును లేదు. అగ్నిసమీపమున గూర్చుండు పక్షమున చలి తీరును. అట్లుచేయక దూరమున నుండి తన చలిని పోగొట్టలేదని అగ్నిదే వుని నిందించుట వలన ప్రయోజన మేమి? సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః, మయ్యర్పిత మనోబుద్ధి ర్యో మద్భక్త స్స మే ప్రియః. -- గీత. 12.14 అనపేక్ష శ్శుచి ర్దక్ష ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్త స్సమే ప్రియః. -- గీత. 12.16 యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి, శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్ య స్సమే ప్రియః. -- గీత. 12.17. తుల్యనిందాస్తుతి ర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్, అనికేత స్థిరమతి ర్భక్తిమాన్ మే ప్రియో నరః -- గీత. 12.19. యే తు ధర్మ్యామృత మిదం యథోక్తం పర్యుపాసతే, శ్రద్దధానా మత్పరమా భక్తా స్తే౭ తీవ మే ప్రియాః. -- గీత. 12.20. అనునట్లు భగవంతుడు భక్తప్రియుడు. ఓ ముకుందా! భవలుంఠనకోవిదా యనిపించుము. భవలుంఠన కోవిదు డనగా జనన మరణరూప సంసారమును ఛేదించుటయందు సమర్థుడు.