चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 116, कुल 674 में से
संदर्भ में पढ़ें96 చక్రదత్త—౫. అర్శోధికారము.
అడవికంద 16 భాగములు, చిత్రమూలము 8 భాగములు, శొంఠి నాలుగుభాగములు మిరియములు 2 భాగములు, కరక్కాయలు ఉసిరిక తాడి పిప్పళ్లు మోడి తాడిశపత్రి నల్లజీడివిత్తనములు వాయువిడంగములు వీనినన్నిటిని నాలుగు నాలుగుభాగములును నేలతాడి 8 భాగములును పెద్దమ్రాను 16 భాగములును, ఏలకులు దాల్చినపట్ట రెండురెండు భాగములు వీటి నన్నిటిని ఒక్కచోట నొక్కమారుగా చూర్ణము రెండురెట్లు బెల్లము కలిపి సేవింపవలయును. ఇయ్యదికామదేవుని వృద్ధి నొందించును. ఈయోగరాజమును సేవించినందువలన నే యగస్త్యునికి మొదట భస్మమగునట్లు జీర్ణశక్తి గలిగినది. అతరువాత భీమసేనునకు గలిగినది అగ్ని బలము వృద్ధియే ఇట్లగుటకు కారణము. ఇయ్యదికేవలము వీర్యమును వృద్ధి నొందించునది మాత్రమే కాదు. అగ్నికిని బలమునకును బుద్ధికిని కారణముగూడ నై యున్నది. శస్త్రములు క్షారచికిత్సలు అక్కఱలేకయే మూలరోగములను పోగొట్టును. శోఫ శ్లీపదము కఫము వాతము వీటివలన పుట్టిన గ్రహణిని పోగొట్టును. శరీరము ముడుతలుపడుట వెంట్రుకలు తెల్లపడుట నశించును. బుద్ధిని పుంస్త్వమును పుట్టించును. వెక్కిళ్లు శ్వాస దగ్గు రాజయక్ష్మము ప్రమేహము పాండురోగము వీటిని పోగొట్టును. ఇయ్యది పురుషులకు రసాయనముతో తుల్యమైనది.
— సూరణపిండి. —
శ్లో. చూర్ణీకృతా షోడశ సూరణస్య
భాగా స్తతోఽర్ధేన చ చిత్రకస్య,
మహౌషధార్ధో మరిచస్య చైకో
గుడేన దుర్నామజయాయ పిండీ. 57
పిండిచేసినఅడవికంద 16 భాగములను, చిత్రమూలము 8 భాగములను, శొంఠి, మిరియములు వీటి నొక్కభాగమును రెట్టింపు బెల్లములో కలిపి ముద్దచేసి సేవించి, మూలరోగములు నశించును. దీనిని పిండిగా చేయవలయును. అనినందున లడ్డువలెగాని కుడుముల వలె గాని చేయవలయునని తెలియువలయును.
— వ్యోషాద్యచూర్ణము. —
శ్లో. వ్యోషాగ్నివృక్షారవిడంగతిలాభయానాం
చూర్ణం గుడేన సహితం తు సదోపయోజ్యం,
దుర్నామకుష్ఠగరశోధశకృద్విబంధా
న్గ్నైర్థ్య త్వక్బలతాం క్రిమిపాండుతాం చ. 58