भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 120, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 120

100 చక్రదత్త—౫. అర్శోరోగాధికారము.

ర్లా నీమాని దాపయేత్, త్రివృత్తేజోవతీ కంద చిత్రకాన్ ద్విపలాంశికాన్. 82. ఏలాత్వజ్మరిచం చాపి గజాహ్వం చాపి షట్పలాం, ద్వాత్రింశతం పలా న్యేవం చూర్ణం దత్త్వా నిధాపయేత్. 83. తతో మాత్రాం ప్రయుంజీత జీర్ణే క్షీరరసాశనః, పంచగుల్మా న్ప్రమేహాంశ్చ పాండురోగం హలీమకమ్. 84. జయే దర్షాంసి సర్వాణి తథా సర్వోదరాణిచ, దీపయే ద్గ్రహణీం మందాం యక్ష్మాణం చాపకర్షతి. 85. పీనసే చ ప్రతిశ్యాయే ఆఢ్యవాతే తథైవ చ, అయం సర్వగదే ష్వేవ కల్యాణో లేహ ఉత్తమః. 86. దుర్నామారి రయం చాశు దృష్టో వారసహస్రశః, భవం త్యేనం ప్రయుంజానాః శతవర్షం నిరామయాః. 87. ఆయుషో దైర్ఘ్యజననో పలీపలితనాశనః, రసాయనవర శ్చైష మేధాజననఉత్తమః. 88. గుడ శృంగిబాహుశాలోయం దుర్నామాగ్నిప్రకీర్తితః.

తెల్లతెగడ చవ్యము తెల్లదింటెన వినుగుపల్లేరు చిత్రమూలము కచ్చూరము పాపరబుడమ తుంగముస్తలు శొంఠి వాయువిడంగములు కరక్కాయలు వీటినన్నిటిని ఒక్కొక్కపలమును, జీడివిత్తులు 8 పలములు, పెద్దమ్రానిచెక్క 6 పలములు, అడవికంద 16 పలములు వీటిని రెండుద్రోణముల నీటిలో వేసి కషాయము చేయవలయును. నాలుగవపాలు నీరు మిగిలియుండగా దింపి వాసెన కట్టి మరల పొయ్యిమీఁద పెట్టి మూఁడింతలు బెల్లము వేసి పక్వముచేయవలయును. (తీగెపాకమురాగానే) గరిటకు అంటుకొని లేచునపుడు దింపి యీక్రింద చెప్పబోవు ఔషధముల చూర్ణములను కలపవలయును. తెల్లతెగడ జ్యోతిష్మతి అడవを用いたకంద చిత్రమూలము ఇవి రెండురెండు పలములును, ఏలకులు లవంగపుపట్ట ఏనుగుపిప్పళ్లు ఇవి ఆరుఆరుపలములు చొ॥ 32 పలములు తీసికొని చూర్ణముచేసి కలపవలయును. తరువాత మాత్రలను కట్టి తగునట్లుగా తినవలయును. ఔషధముజీర్ణమైనతరువాత పాలనుత్రాగవలయును. ఇయ్యదియైదువిధములగు గుల్మరోగములను ప్రమేహమును పాండురోగమును హలీమకమును అన్నివిధములైన మూలరోగములను ఉదరరోగములను పోఁగొట్టును. మందగ్రహణిని క్షయరోగమును పోఁగొట్టును. పీనసయందును ప్రతిశ్యాయమందును వాతరక్తమందును హితకరము. అన్నివిధములగు రోగములయందు యీ లేహము ఉత్తమము హితకరము నగును. మూలరోగములను త్వరగా పోఁగొట్టును. ఇట్లు అనేక పర్యాయములు ఇది నిదర్శనము చూడబడ్డది. దీనిని సేవించినవారు నూరువర్షములు నీరోగులై జీవించెదరు. ఇది ఆయుష్యమును వృద్ధి పొందించునదియును, తల నెరియుటను పోఁగొట్టునదియును, తెలివిని పుట్టించునదియు