भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 123, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 123

ఆంధ్రతాత్పర్యసహితము. 103

మోదుగకట్టలను భస్మముచేసి మూడు నెట్లునీటిలో కొంత మిరియములు పిప్పళ్లు వీటికల్కమువేసి దానియందు సిద్ధముచేయఁబడిన ఘృతమును త్రాగిన గుదరోగములు నశించును. సందేహములేదు.

-•( ఉదకషట్పలఘృతము. )•-

శ్లో. సక్షారైః పఞ్చకోలై స్తు పలికై స్త్రిగుణోదకే.
సమక్షీరం ఘృత ప్రస్థం జ్వరార్శః ప్లీహకాసనుత్. 105

యవక్షారము పంచకోలములు ఒక్కొక్కపలము తీసికొని మూఁడురెట్లు నీటిలో సమానముగా పాలను తీసికొని 16 పదహారుపలముల నేయిని పక్వము చేయవలయును. ఇయ్యది జ్వరమును మూలరోగమును ప్లీహరోగమును దగ్గును పోఁగొట్టును.

-•( సింహ్యామృతఘృతము. )•-

శ్లో. పచే ద్వారి చతుర్ద్రోణే కంటకార్యమృతా శతమ్,
తత్రాగ్ని త్రిఫలావ్యోషపూతి కత్వక్చలింగకైః. 106
సకాశ్యర్యవిడంగై స్తు సిద్ధం దుర్నామమేహనుత్,
ఘృతం సింహ్యామృతం నామ బోధిసత్వేన భాషితమ్. 107

నాలుగుద్రోణములనీటిలో వాకుడును తిప్పతీగె కరక్కాయలను ఏబదేసిపలము చొప్పున వేసి పక్వముఁజేసి అందు చిత్రమూలము త్రిఫలము త్రికటుకములు క్రానుగచెక్క లవంగపుపట్ట కొడిసెపాలవిత్తనములు గుమ్ముడు వాయువిడంగములు వీటిని కలిసి అందు సిద్ధముచేసిననేతిని సేవించిన ప్రమేహములు నశించును. ఇయ్యది బోధిసత్వుండను ఋషిచేతఁ జెప్పఁబడిన ఘృతము.

-•( పిప్పల్యాద్యతైలము. )•-

శ్లో. పిప్పలీం మధుకం బిల్వం శతాహ్వాం మదనం వచామ్, కుష్ఠం
శఠీ పుష్కరాఖ్యం చిత్రకం దేవదారు చ. 108. పిష్ట్వా తైలం విప
క్తవ్యం ద్విగుణక్షీరసంయుతం, అర్శసాం మూఢవాతానాం తచ్చేష్ట
మనువాసనం. 109. గుదనిస్సరణం శూలం మూత్రకృచ్ఛ్రం ప్రవా
హికాం, కట్యూరుపృష్ఠదౌర్బల్య మానాహం వంక్షణశ్రయం. 110.
పిచ్ఛాస్రావం గుదే శోథం వాతవర్చోవినిగ్రహం, ఉత్థానం బహుదోషం
చ జయే చ్చేవానువాసనాత్. 111. రక్తార్శసా ముపేక్షేత రక్త
మాదౌ స్రవే ద్భిషక్, దుష్టాస్రే నిగృహీతే తు శూలానాహౌ వస్సృ