चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 156, कुल 674 में से
संदर्भ में पढ़ें136 చక్రదత్త—౮. పాండురోగాధికారము.
ములో చాల పర్యాయములు శుద్ధిచేయఁబడిన మందూరముమాత్రమే ఇందు పుచ్చుకొనతగినది. మందూరచూర్ణముతోకూడ నెన్నిదిరెట్లు ఎక్కువగా ఆవుపంచితమును పుచ్చుకొనవలయును.
<div align="center">❧ పునర్నవామండూరము. ❧
</div>శ్లో. పునర్నవా త్రివృ చ్ఛుంఠీ పిప్పలీ మరిచానిచ, విడంగం దేవకాష్ఠం చ చిత్రకం పుష్కరాహ్వయమ్. 42.
త్రిఫలాం ద్వే హరిద్రే చ దంతీం చ చవికం తథా. కుటజస్య ఫలం తిక్తాం పిప్పలీమూలముస్తకమ్. 43.
ఏతాని సమభాగాని మండూరం ద్విగుణం తతః, గో మూత్రే ౭ష్టగుణే పక్త్వా స్థాపయే త్స్నిగ్ధభాజనే. 44.
పాండుశోధోదరానాహశూలార్శః క్రి మిగుల్మనుత్.
శొంఠి తెగడ తెల్లగల్లేరు పిప్పళ్లు మిరియములు వాయువిడంగములు దేవదారు మోడి చిత్రమూలము పుష్కరమూలము త్రిఫలములు పసపు మ్రానిపసపు దంతివ్రేచ్చవ్యము కొడిసెపాలపండు కటుకరోహిణి తిప్పతీగ తుంగముస్తలు వీటిని సమభాగములను చేసి అంతకంటె రెండురె ట్లేక్కువ మండూరమును చేర్చి ఎనిమిది రెట్లేక్కువయగు నావుపంచితములో చక్కగా వండి నేతితోమాగినపాత్రములో నుంచవలయును. ఇయ్యది పాండురోగము వాపు కడుపునొప్పులు మున్నగువానిని, ఆనాహము శూల మూలరోగము జంతువాతము గుల్మము వీనిని పోఁగొట్టును.
<div align="center">❧ మండూరవజ్రవటకము. ❧
</div>శ్లో. పంచకోలం సమరిచం దేవదారుపలత్రికం. 45.
విడంగముస్తయుక్తాశ్చ భాగా స్త్రీపలసంమితాః, యావం త్యేతాని చూర్ణాని మండూరం ద్విగుణం తతః. 46.
పక్త్వా చాష్టగుణే మూత్రే ఘనీభూతేత దుద్ధరేత్, తతో ౭క్షమాత్రా న్గుడకాన్ పిబే త్తక్రేణ తక్రభుక్. 47.
పాండురోగం జయ త్యేష మందాగ్రిత్వ మరోచకమ్, అర్శాంసి గ్రహణీదోష మూరు స్తంభ మథాపివా. 48.
క్రిమిప్లీహాన ముదరం గరరోగం చ నాశయేత్, మండూరవజ్రనామాయం రోగానేకవినాశనః. 49.
పిప్పళ్లు మోడి చవ్యము చిత్రమూలము శొంఠి మిరియములు దేవదారు త్రిఫలములు వాయువిడంగములు తుంగముస్తలు వీని నన్నిటిని మూడుభాగములు చొప్పునను వీటి చూర్ణముకంటె రెండురె ట్లేక్కువమండూరమును చేర్చి ఎన్ని దిగెట్లు గోమూత్రములో వండవలయును. వండియైనపుడు ముద్దగట్టగానే దింపి ఒక్కొక్క అక్షము ప్రమాణముగా మాత్రలనుకట్టి మజ్జిగతో పుచ్చుకొనుచుఁడవలయును. మజ్జిగనుకూడను