चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 172, कुल 674 में से
संदर्भ में पढ़ें152 చక్రదత్త — ౯. రక్తపిత్తాధికారము.
నీయం విశేషేణ ఖండఖాద్యం ప్రకుర్వతా. 93. లోహాంతరవ దత్రా పి పుటనాది క్రియోష్యతే, య చ్చ పిత్తజ్వరే ప్రోక్తం బహి రన్తశ్చ భేషజం. 94. రక్తపిత్తే హితం తచ్చ క్షీణక్షతహితం చ యత్.
మేకమాంసము, పావురపుమాంసము, తిత్తిరిపిట్టమాంసము, గోరువంక, కుందేలు, లేళ్లు వీనియొక్క మాంసములును ఈయవచ్చును. కొబ్బరినీళ్లు, చెంచలికూర, చక్రవర్తికూర, ముల్లంగి, జీలకఱ్ఱ, పొట్ల కాయ, పెద్దగుమ్మడి, వంకాయ, మామిడికాయ, ఖర్జూరము, తియ్యదానిమ్మపండ్లు, క్షీరపూర్వకమగు నన్నిపదార్థములు, మెట్ట ప్రదేశములలోని జంతువుల మాంసము వీనిని ఖండఖాద్యమును భక్షించువారలు ప్రయత్నపూర్వకముగా వదలిపెట్టవలయును. ఇతరలోహములకువలెనే ఇచ్చటకూడ పుటపాకము మున్నగువానిఁ జేయుట చాల మంచిది. పిత్తజ్వరముల కొఱకు పైకిని లోపలికిని చెప్పిన యౌషధములనే రక్తపిత్తజ్వరములచే బాధపడువారికి గూడ చేయవలయును. ఇట్టులే క్షీణక్షతరోగులకుఁ గూడ నీయవలయును. ఇయ్యది హితము అగును.
ఇట్లు చక్రదత్తయంద: రక్తపిత్తాధికారప్రకరణము ముగిసెను.