भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 175, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 175

ఆంధ్ర తాత్పర్యసహితము. 155

వీనితో కలిపి కండచక్కెర కలిపి భక్షించినయెడల క్షయరోగము మున్నగు రోగములను దగ్గును నశింపచేయును. పావురము కోతి మేక లేడి వీటిమాంసమును వేరువేరుగా చూర్ణము చేసి మేక పాలతో కలిసి పుచ్చుకొనవలయును. ఇందువలన క్షయరోగము నశించును. నేయి జాజికాయ నాగకేసరములు నాగబల చూర్ణించి వీటినన్నిటిని కలిపి నూరవలయును. లేకున్న నేరుగా కలిపి త్రాగినయెడల కాకజంఘ (క్షయరోగము) నశింపచేయును.

పిప్పళ్లు ద్రాక్ష కలకండ తేనె వీటితో చేసిన లేహము క్షయరోగములను నశింపచేయును. లేకపోయినచో అశ్వగంధ పిప్పళ్లు కలకండ నేయి వీటితో చేసిన లేహమైనను క్షయరోగములను నశింపఁజేయును. కండచక్కెరలోను తేనెలోను నవనీతమును కలిపికొని సేవనచేయుచు పాలతోటి యన్నమును తినువా రగు క్షయరోగులం బలము నొందఁగలరు. ఇయ్యౌషధమునందు (అనఁగా దీనిని సేవించుకాలమునందు) నేతిని తేనెను ఎక్కువగా భక్షింపరాదు.

౦ సితోపలాదిలేహ్యము. ౦

శ్లో. సితోపలా తు గోక్షీరీ పిప్పలీ బహులా త్వచః, అన్త్యా
దూర్ధ్వం ద్విగుణితం లేహయేత్ క్షౌద్రసర్పిషా. 16. చూర్ణితం ప్రాశ
యే దేత చ్ఛ్వాసకాసక్షయాపహమ్, సుప్తజిహ్వా రోచకిన మల్పాగ్నిం
పార్శ్వశూలినమ్. 17. హస్తపాదాలసదాహేషు జ్వరే రక్తే తథోర్ధ్వగే.

కండచక్కెర 16 భాగములు, తవక్షీరి 8 భాగములు, పిప్పళ్లు 4 భాగములు, ఏలకులు 2 భాగములు, లవంగపుపట్ట ఒకభాగము వీని నన్నిటిని కలిపి చక్కఁగా నూరి తేనెలొను కలిపి సేవింపవలయును. ఇయ్యది శ్వాసము, దగ్గు, క్షయరోగము నశింపఁజేయును. మఱియును నాలుక మొద్దుబారియుండుట, అరోచకము, అగ్నిమాంద్యము, పార్శ్వపునొప్పి, ఈరోగములను పోగొట్టి చేతులు, కాళ్లు, భుజములు మున్నగునవి మండునప్పుడును జ్వరమునందును ఊర్ధ్వగతమగు రక్తపిత్తమునందును హితమును కలిగించును. ఇయ్యది సితోపలాదిలేహ మనఁబడును.

౦ లవంగాద్యచూర్ణము. ౦

శ్లో. లవంగ తక్కోల ముశీర చందనం నతం సనీలోత్పలజీరకం స
మమ్, త్వటి స్పృక్కాగురుభృంగకేసరం కణాసవిశ్వానలదం సహాంబు
దమ్. 18. అహీంద్రజాతీఫలవంశలోచనా సీతాష్టభాగం సమసూక్ష్మ
చూర్ణితమ్, సురోచనం తర్పణ మగ్నిదీపనం బలప్రదం వృష్యతమం