भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 177, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 177

ఆంధ్రతాత్పర్యసహితము. 157

చూర్ణముకంటెను తేలికవి యగుచున్నవి. అనేకులు వైద్యులు పిత్తమువలనఁ బుట్టిన క్షయరోగములలో నీచూర్ణమును వాడియున్నారు. మూలమునందు శుభయా అని చెప్పినందున వంశలోచన అని అర్థము చేసికొనవలయును. ఇయ్యదియే తాడిశచూర్ణ మనఁబడును.

వింధ్యవాసియోగము.

శ్లో. శృఙ్గార్జునాశ్వగంధా నాగబలా పుష్కరాభయా ఛిన్నరుహాః, తాలీసాదిసమేతాః లేహ్యా మధుసర్పిర్భ్యాం యక్ష్మహరాః. 25.
మధుతాప్య విడంగాశ్చ జతులోహా ఘృతాభయాః, ఘ్నంతి యక్ష్మాణమత్యుగ్రం సేవ్యమానా హితాశినా. 26. వ్యోషం శతావరీ త్రీణి ఫలాని ద్వే బలే తథా, సర్వామయహరో యోగః సోయం లోహగజోన్వితః. 27. ఏష వక్షఃక్షతం హంతి కంఠజాం శ్చ గదాం స్తథా, రాజయక్ష్మాణ మత్యుగ్రం బాహుస్తంభ మథార్దితం. 28.

కర్కాటకశృంగి, మద్దిపట్ట, పెన్నేరుగడ్డ, నాగబల, పుష్కరమూలము, కరక్కాయ, తిప్పతీగె, తాడిశపత్రి, మిరియాలు, శొంఠి, పిప్పళ్లు, తవక్షీరి, దాల్చెనచెక్క, ఏలకులు వీనినిచేర్చి చూర్ణించి కలిపి ఈయౌషధులయందు ముందు చెప్పిన తాడిశపత్రీ చూర్ణముతోచేసిన ఔషధినికలిపి తేనె, నేయినికూడ నందు చేర్చి భక్షించినచో క్షయరోగములు నశించి పోగలవు. తేనె, వాయువిడంగములు, శిలాజిత్తు, లోహభస్మము, నేయి, కరకకాయ వీటిని లేహముచేసి భక్షించుచు హితకరముగా భోజనమును చేయవలయును. ఇట్లు చేసినయెడల అతిభయంకరము లైన క్షయరోగములను కూడ నశింపఁజేయును. శొంఠి, మిరియములు, పిప్పళ్లు, పిల్లిపీచర [దీనినే కొందఱు చల్లగడ్డ యందురు.] త్రిఫలములు నాగబల ముత్తవపులగము లోహభస్మము వీటితో చేయఁబడు యోగము అన్నివిధములైన రోగములను హరింపఁజేయును. ఇయ్యది రొమ్మునొప్పి గొంతుసంబంధము లగు నన్నిరోగములను పోఁగొట్టును. మఱియును మిక్కిలి భయంకరము లగు క్షయరోగములను చచ్చులను అర్దిత మను రోగమును హరించును. ఇయ్యది వింధ్యవాసియోగ మనఁబడును. దీనినే కొందఱు శృఙ్గార్జునాది యోగ మందురఁట.

రసేంద్రగుటిక.

శ్లో. కర్షః శుద్ధరసేంద్రస్య స్వరసేన జయార్ద్రయోః, శిలాయాం ఖల్వయే త్తావ ద్యావ త్పిండం ఘనం తతః. 29. జలకర్ణా కాకమాచీ రసాభ్యాం భావయే త్పునః, సౌగంధికఫలం భృంగస్వరసేన