चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 178, कुल 674 में से
संदर्भ में पढ़ें158 చక్రదత్త—౧౦. రాజయక్ష్మాధికారము.
విభావితం. 30. చూర్ణితం రససంయుక్త మజాక్షీర పలద్వయే, ఖల్వితం ఘనపిండం తు గుటీః స్విన్నకలాయవత్. 31. కృత్వా౬ర్చ శివ మభ్యర్చ్య ద్విజాతీ స్వ్రితోష్య చ, జీర్ణాన్ని భక్షయే దేకాం క్షీరమాంసరసాశనః. 32. సర్వరూపం క్షయం కాసం రక్తపిత్త మరోచకం, అపి వైద్యశతై స్త్యక్త మమ్లపిత్తం నియచ్ఛతి. 33.
యథావిధిగా శుద్ధిచేసిన పాదరసము ఒకకర్షము తెచ్చి ఖల్వములో వేసి తక్కిన రసము అల్లపురసముల నందుచేర్చి చక్కఁగా నూరవలయును. బాగుగా ముద్దగట్టు వఱకిట్లు మర్దింపవలెను. చాగమట్టరసమునందు మరల దానిని భావనచేయవలయును. తరువాత ఏలకులు లవంగపట్ట జాపత్రి నాగకేసరములు వీటిని చూర్ణమును ఒకపలమునందు కలిపి గుంటకలగరాకురసమునందు భావన కట్టవలయును. ఆసిమ్మట చూర్ణమును చేసి మేకపాలు రెం డుపలముల తెచ్చి వానితో చక్కఁగా మర్దింపవలయును. గట్టిగానై ఉండకట్టునంతః ఆ కిట్లు మర్దించి సెనగగింజ లంతంత మాత్రలను చేసికొని మొదట నీశ్వరుని పూజించి, బ్రాహ్మణుల సంతోష పెట్టి అన్నము జీర్ణమైన పిమ్మట ఒకమాత్రను తినవలయును. పాలు మాంసపురసమును భుజింపవలయును. ఈమాత్రలు అన్ని విధములగు క్షయ దగ్గు రక్తపిత్తము అరోచకము మున్నగువానిని పండెఱఱబడి వైద్యులు చికిత్సచేసి సాధింపనేరక వదలివైచిన ఆమ్లపిత్తములను తొలగించును. ఇయ్యది రసేంద్రగుటిక యనఁబడును.
ఏలాదిమంథము.
శ్లో. ఏలాజమోదామలకాభయాక్ష గాయత్రినింబశ్వనశాలసారాన్, విడంగభల్లాతకచిత్రకాం శ్చ కిటుత్రి కాంభోదసురాష్ట్రీకాశ్య. 34. పక్త్వా జలే తేన పచేత్తు సర్పి స్తస్మి న్సుసిద్ధే త్వవతారితే చ, త్రింశత్పలా న్యత్ర సితోపలాయా దద్యాత్తు గోక్షీరపలాని షట్చ. 35. ప్రస్థే ఘృతస్య ద్విగుణం చ దద్యాత్ క్షౌద్రం తతో మంథహతం నిదధ్యాత్, పలం పలం ప్రాత రతో లిహే చ్చ పశ్చాత్పిబేత్ క్షీరమతంద్రిత శ్చ. 36. ఏత ద్ధి మేధ్యం పరమం పవిత్రం చక్షుష్య మాయుష్య తమం తథైవ, యక్ష్మాణ మాశు వ్యపహంతి శూలం పాండ్వామయం చాపి భగందరం చ. 37. న చాత్ర కించి త్పరివర్జనీయం రసాయనం చైత దుపాస్యమానం.