चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 211, कुल 674 में से
संदर्भ में पढ़ें192 చక్రదత్త—౧౫. ఛర్ద్యధికారము.
టిచూర్ణమును కలిపి త్రాగిన ఛర్దిని జయించును. వాయువిడంగములు తుంగముస్తలు శొంఠి వీటిచూర్ణములో తేనెను కలిపికొని సేవించిన కఫఛర్ది నాశన మగును. లేకున్న నేరేడుచూర్ణము రేగుచూర్ణము వీటిలో తుంగముస్తల కర్కాటకశృంగి చూర్ణములు గాని, సమూలముగా చేసిన దూలగొండి చూర్ణము గాని, తేనెను వైచికొని సేవించిన యెడల కఫసంబంధము లగు ఛర్దులు నశించును.
❧ త్రివిధ ఛర్దులకు ఉపాయములు. ❧
శ్లో. తర్పణం వా మధుయుతం తిసృణా మపి భేషజమ్,
కృతం గుడూచ్యా విధివ త్కషాయం హిమసంజ్ఞితం. 14.
తిసృష్వపి భవే త్పథ్యం మాక్షికేణ సమాయుతం,
ద్రవ్యా దాపోత్థితాత్తోయే ప్రతప్తే నిశి సంస్థితాత్. 15.
కషాయో యో భినిర్యాతి శీతః స్సముదాహృతః,
షడ్భిః పలై శ్చతుర్భి ర్వా సలిలా చ్ఛీతఫాంటయోః. 16.
ఆప్లుతం భేషజపలం రసాభ్యాం నలద్వయం,
శ్రీఫలస్య గుడోచ్యా వా కషాయో మధుసంయుతః. 17.
పేయ శ్ఛర్దితయే శీతో మూర్వా వా తండులాంబునా.
జంబ్వామ్రపల్లవగ వేధుకధాన్యసేవ్య హ్రీబేరవారిమధునా పిబతో ల్పమల్పం,
ఛర్దిః ప్రయాతి శమనం త్రిసుగంధిముక్తా లీఢా నిహంతి మధునా ఒథ దురాలభావా. 18.
జాతీరసః కపిత్థస్య పిప్పలీమరిచాన్వితః,
క్షౌద్రేణ యుక్త శ్శమయే ల్లేహో౭యం ఛర్ది ముల్బణాం. 19.
పిష్ట్వా ధాత్రీఫలం ద్రాక్షాం శర్కరాం చ పలోన్మితామ్,
దత్త్వా మధుపలం చాత్ర కుడవం సలిలస్య చ. 20.
వాససా గాలితం పీతం హంతి ఛర్దిం త్రిదోషజాం.
తిప్పతీగెను హిమసంజ్ఞక కషాయమును చేసి తేనెకలిపి త్రాగిన ఛర్దులు నశించును. వేడినీటిలో యౌషధలను రాత్రిపూట నానవైచిన ప్రాతఃకాలమున చల్లఁబడినది హిమసంజ్ఞక మనఁబడును.
హిమసంజ్ఞక, ఫాంటసంజ్ఞక కషాయములలో ఆరుపలములు, లేక 4 పలముల నీటిని పోసి యౌషధులను నానవేయవలయును. రసములోకూడ 2 పలములను నీరు చేర్చుకొనవలయును. మారేడుచెక్క తిప్పతీగెల కషాయములో తేనెను చేర్చికొని త్రాగినయెడల కాని చాగపండ్లను బియ్యపుకడుగుతో గాని త్రాగినయెడల ముత్తెఁగులగు ఛర్దులు నశించును. నేరేడు మామిడిఇగుళ్ళు అడవిగోధుమలును, ధనియములు సిప్ఫళ్ళు వట్టివేరు వీటిని రసముతీసి నీళ్లలో కలిపి తేనె నందులో వేసికొని కొంచెము