चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
DevanagariHindipublished674 पृष्ठ
पृष्ठ 213, कुल 674 में से
संदर्भ में पढ़ेंपृष्ठ 213
194 చక్రదత్త—౧౫. ఛర్ద్యధికారము.
ధనియములు జీలకఱ్ఱయును కరక్కాయలు తిప్పతీగె మిరియములు తేనె పిప్పళ్లును ఈ మాటితో చేయఁబడిన లేహ మన్నివిధము లగు ఛర్దులను అరోచకములను శాంతి నొం దించును.
❧ పద్మకఘృతము. ☙
శ్లో. పద్మకామృతనింబానాం ధాన్యచందనయోః పచేత్, కల్కే క్వాథే చ హవిషః ప్రస్థం ఛర్దినివారణమ్, తృష్ణారుచిప్రశమనం దాహ జ్వరహరం పరమ్. 26.
కమలములు తిప్పతీగె వేప ధనియములు చందనము వీటితో చేయఁబడిన కషా యములోను కల్కములోను 16 పలముల నేతిని పోసి వండి సిద్ధముచేసి త్రాగినయెడల ఛర్దులు నశించును. మఱియును దప్పి ఆరుచి దాహము జ్వరము దీనిని ఎక్కువగా పోఁ గొట్టును. ఇయ్యది పద్మకఘృత మనఁబడును.
ఇట్లు చక్రదత్తయందు ఛర్ద్యధికార ప్రకరణము ముగిసెను.