भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 259, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 259

240 చక్రదత్త—౨౨. వాతవ్యాధ్యధికారము.

మాషతైలము.

శ్లో. మాషాత్మగుప్తాత్రివిటోరుబూక రాస్నాశతాహ్వాలవణైః సుపిష్టైః,
చతుర్గుణే మాషబలాకషాయే తైలం కృతం హంతి చ పక్షవాతం.

మినుములు దురదగొండి యష్టిమధుకము ఆముదపువేళ్లు సన్నరాస్న సదాప సైంధవలవణము వీటికల్కములో నాలుగురెట్లు మినుములను ముత్తవపులగపుకషాయమునుచేర్చి యందు తైలమును పక్వము చేయవలయును. ఈ తైలమును సేవించినచో పక్షవాతములును నశించును.

ఇంక నొకవిధమగు మాషతైలము.

శ్లో. మాషప్రస్థం సమావాప్య పచే త్సమ్యగ్జలాఢకే,
పాదశేషేరసే తస్మిన్ క్షీరం దద్యా చ్చతుర్గుణమ్. 145.
ప్రస్థం చ తిలతైలస్య కల్కం దత్వా తు సమ్మితం,
జీవనీయాని యాన్యష్టౌ శతపుష్పాం ససైంధవం. 146.
రాస్నాత్మగుప్తా మధుకం బలావ్యోషం త్రికంటకం,
పక్షాఘాతార్దితే వాతే కర్ణశూలే సుదారుణే. 147.
మందశ్రుతౌ చాశ్రవణే తిమిరే చ త్రిదోషజే,
హస్తకంపే శిరఃకంపే విశ్వాచ్యా మపబాహుకే. 148.
శస్తం కలాయఖంజేశ్చ పానాభ్యంజనవస్తిభిః,
మాషతైల మిదం శ్రేష్ఠ మూర్ధ్వజత్రుగదాపహమ్. 149.

16 పలముల మినుములను తెచ్చి ఒకద్రోణము నీటిలొ వండి నాల్గవపాలు నీరు మిగిలియుండఁగా నందు నాలుగురెట్ల పాలను కలపవలయును. పిమ్మట పదియారుపలముల నువ్వులనౌనెను ఒక్కొకకర్షము (అనఁగా పావుపలము) జీవనీయగణపు ఔషధములను సదాప సైంధవలవణము సన్నరాస్న దురదగొండి ముల్లంగి ముత్తవపులగము శొంఠి మిరియములు పిప్పళ్లు పల్లేరు వీటిని కల్కము చేసి అందు కలిపి ఆకల్కమునందు సిద్ధము చేయఁబడిన తైలము పక్షపాతములను అర్దితవాతములను భయంకరము లగు కర్ణశూలలను వినిపింపకపోవుట చెవుడు త్రిదోషములవలనఁ బుట్టిన తిమిరరోగములను కంపరోగములను శిరఃకంప హస్తకంపములను బాహుశోషములు అపబాహకము బధిరరోగము మున్నుగువానిని కలిగియున్నయెడల దీనిని త్రాగుటయును రుద్దుకొనుటయును వస్తికరంముల నుపయోగించుటయును మంచిది. ఇయ్యది మాషతైలము. ఇది పైభాగములయందు కలిగిన వాతరోగముల నన్నిటిని పోఁగొట్టును.