भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 262, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 262

ఆంధ్రతాత్పర్యసహితము. 243

మంజిష్ఠ చిత్రమూలము గుమ్ములు శొంతి మిరియములు పిప్పళ్లు మోడి సన్నరాష్ట్ర యష్టిమధుకము దేవదారువు తిప్పతీగె చెంగల్వకోష్టు పెన్నేరు వస కచ్చూరము వీటినన్ని ఒక్కొక్కపావుపలముచొప్పున వేసి కల్కమును చేసి ఈకల్కమును పైదానియందు కలిపి సన్నని నిప్పుసెగపై నుంచి పక్వముచేసి దింపవలయును. ఇయ్యది పక్షవాతము, తలనొప్పి త్రిదోషములవలన గలిగెడి తిమ్మిరులు కాలుచేతులు తల మెడ వడకుచుండుట మందముపడుట పంగువాతము గృధ్రసి అపబాహుకము వీటియందు త్రాగించుట వస్తులనుచేయుట రుద్దుట నస్యవిధి నొనర్చుట చెవులలో పోయుట, కంటిలో వేయుట మున్నగువాని ద్వారా యుపయోగించిన యపూర్వగుణము నిచ్చు నని వైద్యులు ప్రశంసించెదరు.

రెండవ మహామషా తైలము.

శ్లో. ద్విపంచమూలీం నిఃక్వాథ్య తైలాత్ షోడశభి ర్గుణైః,
మాషాఢకం సాధయిత్వా తన్నిర్యూహం చతుర్గుణమ్. 166.
గ్రాహయిత్వా తు విపచే త్తైలప్రస్థం పయఃసమమ్,
కల్కార్థం చ సమావాప్య భిషగ్ద్రవ్యాణి బుద్ధిమాన్. 167.
అశ్వగంధాం శఠీం దారుబలాం రాస్నాం ప్రసారణీం,
కుష్ఠం పరూషకం భార్జీం ద్వే విదార్యా పునర్నవాం,
మాతులుంగఫలాంభోజై రమరం శతపుష్పికాం. 168.
శతావరీంగోక్షురకం పిప్పలీమూలచిత్రకమ్,
జీవనీయగణం సర్వం సంహృత్యైవ ససైంధవమ్. 169.
త త్సాధుసిద్ధం విజ్ఞాయ మాషతైలమిదం మహత్,
వస్త్యభ్యంజనపానేషు నావనే చ ప్రయోజయేత్. 170.
పక్షాఘాతే హనుస్తంభే అర్దితే సాపతంత్రకే,
అపబాహుక విశ్వాచ్యోః ఖంజపంగులయోరపి. 171.
హనుమన్యాగ్రహే చైవ మథిమంథే చ వాతీకే,
శుక్రక్షయే కర్ణనాదే కర్ణశూలే చ దారుణే. 172.
కలాయఖంజశమనే భైషజ్యమిద మాదిశేత్,
దశమూలాఢకం ద్రోణే నిఃక్వాథ్య పాదికో భవేత్. 173.
క్వాథ శ్చతుర్గుణః తైలా న్మాషక్వాథే ప్యయం విధిః,

దశమూలముల కషాయమును తైలమున కన్న పదియారురెట్లు తీసికొని, మినుముల కషాయమును ఒకఆఢకపరిమితిని సిద్ధముచేసి, దానియందు 16 పలముల తైలమును, 16 పలములపాలను కలిపి కల్కము చేయుటకు బుద్ధిమంతు డగు వైద్యుడు పెన్నేరు, కచ్చూరము, దేవదారు, ముత్తవపులగము, సన్నరాష్ట్ర, సదాప, చెంగల్వ

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित) · पृष्ठ 262, कुल 674 में से · BharatKosha