चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 263, कुल 674 में से
संदर्भ में पढ़ें244 చక్రదత్త—౨౨. వాతవ్యాధ్యధికారము.
కోష్ఠు గంటుభారంగి నేలగుమ్ముడు పాలగుమ్ముడు శొంతి తెల్లగలిజేరు మాదీఫలము జీలకఱ్ఱ ఇంగువ సదాప పిల్లపిచ్చర పల్లేరు మోడి చిత్రమూలము జీవనీయగణము లోని అన్నిమూలికలు సైంధవలవణము వీని నన్నిఁటిని కలిపి ఈమహామాష తైలమును సిద్ధము చేసి వస్తికర్శ్మ ముద్వారా తలంటు నస్యవిధులద్వారా ప్రయోగింపవలయు. పక్షఘాతము, మోకాళ్లుపట్టుకొనిపోవుట, అర్దితవాతము, అపతంత్రకము, అపబాహుకము, విశ్వాచి, పంగువాతము, మన్యాగ్రహము, అధిమంథము శుక్రక్షయము, చెవిదిమ్ము, భయంకరమగు చెవిపోటు, కలాయఖంజములు వీటిని పోఁగొట్టుటయందు దీనిని ఉపయోగింపవలయును. అధికపరిమిత మగు దశమూలముల కషాయమును, ఒకద్రోణము నీటిలో పోసి పక్వముచేసి నాలుగవభాగము మిగిలియుండగా నింతకునాలుగురెట్లు తైలముతో పక్వము చేయవలయును. మాషకషాయములయందు ఇదియే నిర్మాణవిధి యని యెఱుఁగదగినది.
-• మజ్జాస్నేహము. •-
శ్లో. గ్రామ్యానూపోదకానాం తు భిన్నాస్థీని పచేజ్జలే. 174. తం స్నేహం దశమూలస్య కషాయేణ పునః పచేత్, జీవకర్షభ కాస్ఫోతా విదారికపికచ్ఛుభిః. 175. వాతఘ్నై ర్జీవనీయైశ్చ కల్కై ర్ద్వితీరభాగికం, తత్సిద్ధంనావనాభ్యంగాత్తథా పానానువాసనాత్. 176. శిరఃపార్శ్వాస్థిశోఫసం ప్రణుద త్యాశు మారుతమ్, యేస్యుః ప్రక్షీణమజ్జానః క్షీణశుక్రాజస శ్చ యే. 177. బలపుష్టికరం తేషా మేతత్స్వ ద్మృతోపమమ్.
గ్రామ్యజంతువులు నీటిపట్టులనందు జంతువులు నీటిజంతువులు వీటియొక్కఎముకలను నీటిలో వేసి వండవలయును. ఇట్లు వండినదానిని దశమూలముల కషాయముతో మరల వండవలయును. జీవకము ఋషభకము విష్ణుక్రాంత నేలగుమ్ముడు దురదగొండి వాతనాశకము లగు జీవనీయగణములోని యౌషధులు వీటితో కల్కము చేసి 2 భాగములను వీనికలిపి సిద్ధముచేసి నస్యవిధిఅభ్యంగనముల ద్వారాను పానము వస్తికర్శ్మ మూలమూలముగాను ప్రయోగించిన శిరోవాతము పక్షవాతము అస్థివాతము కోష్ఠవాతము మున్నగువానిని పోఁగొట్టును. ఇయ్యది క్షీణమజ్జ గలవారలకును, క్షీణించిన శుక్రము బలము కలవారలకును బలమును పుష్టిని గలిగించును. అమృతముతో సమానముగా నిది పనిచేయును.