चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 264, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్రతాత్పర్యసహితము. 245
చతుస్స్నేహము.
శ్లో. ప్రస్థ స్స్యా త్రిఫలాయాస్తు కులుత్థకుడవద్వయమ్. 178.
కృష్ణగన్ధాత్వగాఢక్యోః పృథ క్పంచపలం భవేత్, రాస్నాచిత్రకయోర్ద్వేద్వ్యే దశమూలం పలోన్మితం. 179.
జలద్రోణే పచే త్పాదశేషం ప్రస్థోన్మితం పృథక్, సురారానాలదధ్యమ్ల సౌవీరకతుషోదకం. 180.
కోలదాడిమవృక్షామ్లరసం తైలం ఘృతం వసామ్, మజ్జానం చ పయశ్చైవ జీవనీయపలాని షట్. 181.
కల్కం దత్త్వా మహాస్నేహం సమ్యగేనం విపాచయేత్, శిరామజ్జాస్థిగే వాతే సర్వాంగైకాంగరోగీషు. 182.
లేపనాభ్యేశూలేషు త మభ్యంగం ప్రదాపయేత్.
త్రిఫలములు 16 పలములు, ఉలవలు 8 పలములు, మునగచెక్క 5 పలములు, తువరిమన్ను 5 తులములు, సన్నరాస్న చిత్రమూలము 2 పలములు, దశమూలములు 1 పలము వీటి నన్నిటిని 16 పలముల నీటిలో వైచి కషాయముగాఁ గాచి నాల్గవపాలు మిగిలియున్నప్పుడు కల్లు గంజి మజ్జిగపైతేట సౌవీరమనుగంజి తుషోదకము రేగు దానిమ్మ మాడీఫలము వీటియొక్కరసము తైలము నేయి క్రొవ్వు మజ్జ పాలు వీటిని 16 పలముల చొప్పున చేర్చి జీవనీయగణపు మూలికలను 6 పలములను చేర్చి వీటితో కల్కమును చేసి తైలమును చక్కగా పక్వము చేయవలయును. ఇయ్యది నాడులలోని వాతమును మజ్జావాతమును అస్థివాతమును సర్వాంగవాతమును ఏకాంగవాతములను కంపము శూలమున్నగు రోగములను పోఁగొట్టును. దీనిని పైరోగములయందు మర్దనము చేయవలయును.
కుబ్జప్రసారణీతైలము.
శ్లో. ప్రసారణీశతం క్షుణ్ణం పచేత్తోయార్మణే శుభే. 183.
పాదశిష్టే సమం తైలం దధి దద్యా త్సకాంజికం, ద్విగుణం చ పయో దత్త్వా కల్కాన్ద్విపదికాం స్తథా 184.
చిత్రకం పిప్పలీమూలం మధుకం సైంధవం వచామ్, శతపుష్పాం దేవదారు రాస్నాం వారణపిప్పలీం. 185.
ప్రసారణ్యా శ్చమూలాని మాంసీభల్లాతకానిచ, పచే న్మృద్వగ్నినా తైలం వాతశ్లేష్మామయాన్ జయేత్. 186.
అశీతిం నరనారీస్థా న్వాతరోగా నపోహతి, కుబ్జం స్తిమితపఙ్గుత్వం గృధ్రసీఖుడుకార్దితమ్, హనుపృష్ఠశిరోగ్రీవా స్తంభం వాపి సియచ్ఛతి. 187.