चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 266, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్ర తాత్పర్యసహితము. 247
సప్తశతీప్రసారణీ తైలము.
శ్లో. సమూలపత్రాముత్పాట్య శరత్కాలే ప్రసారణీ. 192.
శతం గ్రాహ్యం సహచరా చ్ఛతావర్యాః శతం తథా, బలాత్మగుప్తాశ్చ
గంధా కేతకీనాం శతం శతం. 193. సచే చ్చతుర్గుణే తోయే ద్రవై
స్తైలాఢకం భిషక్, మస్తు మాంసరసం శుక్రం పయ శ్చాఢక మాఢ
కం. 194. దధ్యాఢక సమాయుక్తం పాచయే న్మృదునాగ్నినా, ద్రవ్యా
ణాం చ ప్రదాతవ్యా మాత్రా చార్ధపలాంశికా. 195. తగరం మదనం
కుష్ఠం కేసరం ముస్తకం త్వచం, రాస్నా సైంధవపిప్పల్యా మాంసీ మంజి
ష్ఠయష్టికా. 196. తథా మేదా మహామేదా జీవకర్షభకౌ పునః, శత
పుష్పా వ్యాఘ్రనఖం శుంఠీ దేవాహ్వమేవ చ. 197. కాకోలీక్షీరకా
కోలీ వచా భల్లాతకం తథా, పేషయిత్వా సమా నేతా న్సాధనీయా
ప్రసారణీ, నాతీపక్వం న హీనం చ సిద్ధం పూతం నిధాపయేత్. 198.
యత్రయత్ర ప్రదాతవ్యా తన్మే నిగదతః శృణు, కుబ్జానాం మథ పఙ్గూ
నాం వామనానాం తథైవ చ. 199. యస్య శుష్యతి చైకాంగం యేచ
భగ్నాస్థిసంధయః, వాతశోణితదుష్టానాం వాతోపహతచేతసామ్. 200.
స్త్రీషు ప్రక్షీణశుక్రాణాం వాజీకరణ ముత్తమం, వస్తౌ పానే తథాభ్యం
గే నస్యేచైవ ప్రదాపయేత్. 201. ప్రయుక్తం శమయ త్యాశు
వాతజా న్వివిధాన్గదాన్,
తాత్పర్యము:
శరత్కాలమునందు వేళ్లు ఆకులతోటి గలగొంతిమగోరును తెచ్చి నూరుపలముల గోరింటను నూరుపలముల పిల్లిపిచ్చరను ముత్తువపులగము దురదగొండివిత్తనములు పెన్నేరు మొగలిదళములు వీటి నన్నిటిని నూరునూరు పలములను తీసికొనవలయును. వీటిని నాలుగురెట్లనీటితోను ద్రవములతోను తైలమును పక్వము చేయవలయును. పెఱుగుపై తేట మాంసరసము పులికడుగు పాలు పెరుగు వీనిని ప్రత్యేకముగా నొక్కొక్క యాఢకము చొప్పున చేర్చి సన్నని మంటపైని పక్వము చేయవలయును. ఈ తైలమునందిక్రింద చెప్పఁబోయెడి యౌషధములను అరపలముఅరపలము చొప్పున చేర్పవలయును.
తగరము ఉమ్మెత్త చెంగల్వకోష్టు కేసరి తుంగముస్తెలు లవంగపుపట్ట సన్నరాస్న సైంధవలవణము పిప్పళ్లు జటామాంసి మంజిష్ఠము యష్టిమధుకము మేద మహామేద జీవకము ఋషభకము సదాప జెముడుపాలు శొంఠి దేవదారు కాకోలి క్షీరకాకోలి వస జీడివిత్తనములు వీటి నన్నిటిని సమానముగా చేకొని నూరి కల్కమును చేసి పైవానిలో క