चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 271, कुल 674 में से
संदर्भ में पढ़ें252 చక్రదత్త—౨౨. వాతవ్యాధ్యధికారము.
జీర్ణకోశమునం దున్నవాతమునకు, వస్తివిధుల నొనర్పవలయును. శరీరమునంతను గ్రమ్ముకొనిన వాతమునందు నిర్యూహము నొనర్పవలయును. ఈతైలము వయోవస్థలోనున్న ఆడుగుట్లకును మొగగుట్లకును అమృతతుల్య మైనది. ఈతైలమే మనుజులకును ఏనుగులకును గోవులకును అమృతముతో సమానము అయినది. ఎండిపోయిన మాకు లీతైలముతో చల్లఁబడినయెడల (సేచనముచేయఁబడినయెడల) మరల మొలకెత్తును. ఫలవృక్షములు నగును. ఈతైలసేవనముచేత వృద్ధుఁడును తరుణుఁ డగును. గొడ్రంబోతు బిడ్డలను కనును. సంతానము లేనిపురుషుఁడు దీనిని సేవించి సుతుని బడయగలుగును. ఎనుబదివిధము లగు వాతరోగములను పిత్తరోగములను, శ్లేష్మరోగములను పోగొట్టును. సన్నిపాతములవలనఁ బుట్టెడి రోగములను మిగుల శీఘ్రముగా శమింపఁజేయును, దీనివలన కన్నులు మసకలుగలవారికి దృష్టి గలుగును. గొప్పదృష్టి నిచ్చునదియు నై యిది యున్నయది, ముందుగా విష్ణు నారాధించి పిమ్మట ఈతైలము నుపయోగింపవలయును. కషాయములో దేవదారువు దొరకనియెడల సన్నరాస్న 50 పలములును జీడివిత్తనములు దొరకనిచో దానిస్థానమునందు రక్తచందనము లవంగపుపట్ట జాపత్రి తాడిశపత్రి ఉసిరిక కోష్ఠు జాజి పిప్పలిమూలము మైనఫలము వీటినన్నిటి నెక్కువగా వేయుచుండవలయును. శుక్తమునందు గంధకపునీటిని చేర్పవలయును. ద్రవ్యశుద్ధి పాకవిధి యున్నగునవి ముందు చెప్పఁబోయెడి ప్రసారిణీతైలముతో సమానముగా తెలుసుకొనవలయును.
| ౭ నఖశుద్ధిః ౧౮ |
శ్లో. శతపత్రం ప్రసారణ్యా ద్వేచ పీతసహచరాత్ . 228. అశ్వగంధైరండబలావరారాస్నాపునర్నవా, కేతకీదశమూలంచ పృథక్పక్వాఢకైః. 229. ప్రత్యేకం మేషాం తు తులా తులార్థం కిలిమాత్త్థకా, తులార్థం స్యాచ్ఛిన్నీహచ్చలాత్హాయాఃపంచవింశతిః. 230. పలానిలోధ్రాచ్చ తథా సర్వ మేకత్ర సాధయేత్, జలపంచాఢకశతే సపాదే తత్ప్రశేషయేత్. 231. ద్రోణద్వయం కాంజికంచ షడ్వింశత్యాఢకోన్మితం, క్షీరదథ్నోః పృథక్ప్రస్థాన్ దశమం త్వాఢకం తథా. 232. ఇక్షురసాఢకంచైవ ఛాగమాంసతులాత్రయే, జలపంచచత్వారింశత్ప్రస్థాన్పక్త్వేతు శోషయేత్. 233. సప్తదశరసప్రస్థాం స్తంజిత్పాక్త్వాథ ఏవ చ, కుడవోనాఢకోన్మానద్రవైరేతైస్తు సాధయేత్. 234. సుశుద్ధతిలతైలస్య