भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 270, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 270

ఆంధ్రతాత్పర్యసహితము. 251

క్షిప్రమేవతు, ఏతేనాంధకదృష్టినాం కృతం పుంసవనం మహత్. 224.
కృత్వా విష్ణో ర్బలిం చాపి తైలమేత త్ప్రయోజయేత్, క్వాథే తులా
ర్ధంరాస్నాయాః కిలిమస్యచ దీయతే. 225. భల్లాతకాసహ త్వేతు తత్థా
నే రక్తచందన, త్వక్పత్రం పత్రమధురీ కుష్ఠం చంపకగైరికాః. 226.
గ్రంధికోశామ్రువకమధిక త్వేనదీయతే, కర్పూరమదదానంచ శుక్లైర్దం
ధోదకక్రియా. 227. ద్రవ్యశుద్ధిః పాకవిధిర్వావిప్రసారణీసనుః.

వేళ్లు కొమ్మలు ఆకులతో గూడిన గొంతిమగోరు 300 పలములులు, పిల్లిపీచర నూరుపలములును, పెన్నేరు నూరుపలములును, మొగలివేళ్లు 100 పలములును, దశమూలములు, 100 పలములును, ముత్తువపులగము, నూరుపలములును, గోరింట, 100 పలములును వీటిని ఒకద్రోణము నీటిలో పక్వముచేసి, నూరవపాలు నీరు మిగిలియుండగా దించి ఆకషాయమును, అందునకు రెండురెట్లు, గంజినీ మజ్జిగ 64 పలములపాలు, శుక్తము ఇక్షురసము, మాంసరసము, వీటినన్నిటిని ఒక్కొక్క ఆఢకముచొప్పున చేర్చవలయును. తైలము ఒకద్రోణమును, అందు కలిపి, గట్టిపాత్రములో నుంచవలయును. ద్రవ్యములను, కల్కమును చేయఁదగిన వానిని ఇకమీద చెప్పెదను. నల్లజీడివిత్తనములు, గ్రంధితగరము, శొంతి, పిప్పళ్లు, చిత్రమూలము, కచ్చూరము, వస, స్పృక్కయను గంధద్రవ్యము, గొంతిమగోరు పిప్పలిమూలము, దేవదారువు, పిల్లిపీచ్చర చిన్నయేలకులు లవంగపుపట్ట, కురువేరు, కేసరి కస్తూరి మంజిష్ఠము, శిలాజిత్తు నఖము అగరు కర్పూరము, పసపు, లవంగము, వట్టివేళ్లు, చందనము, కంకోలము, పొలకము, తుంగముస్తెలు, మ్రానిపసపు కమలము, జాపత్రి కచ్చూరము, రేణుక మను ద్రవ్యము మంచిగంధపు ధూపము, మొగలి త్రిఫలములు వట్టివేళ్లు పిల్లిపిచ్చర దేవదారు ధూపము కమలకేసరము ప్రైంఖణము వట్టివేరు, జీవకాదిగణపుటౌషధములును దశమూలములు పెన్నేరు, నాగకేసరములు, రసాంజనము, కటుకరోహిణి, జాపత్రి పోక, అందుగురసము వీటి నన్నిటిని మూడుమూఁడు పలములను చేర్చి, సన్నని మంటపైని పక్వము చేయవలయును. గట్టిదియును వెడల్పుఅయినదియు నగు పాత్రమునందు ఈప్రసారిణీతైలమును, పక్వము చేయవలయును. ఇచ్చట నారువిధము లగు ప్రయోగములు, ఈతైలముతో నొనర్పవలయును. దీనితో తలంటుకొనిన త్వగ్గతమగు వాతము నశించును. పానమువలన కోష్ఠగత మగు వాతమును పోగొట్టును. భుజించుటనలన సూక్ష్మనాదులయందు గల వాతమును నశింపఁజేయును. నస్యవిధివలన ఊర్ధ్వభాగమునం దున్న వాతమును పోగొట్టును.