भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 276, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 276

ఆంధ్ర తాత్పర్యసహితము. — 257

తో భావన చేసినయెడల శుద్ధమగును. గంజిలో శుద్ధిచేయబడిన శిలాజిత్తుతోను వేచిన కరక్కాయ, బెల్లపుపానకముతో కలిపి చల్లవలయును. పిమ్మట ననేకవిధములగు పుష్పములతో వాసన కట్టవలయును. ఆవిరివలన చెమటను పుట్టించి దుర్గంధమును తొలగింపవలయును. మేకమాంసపు రసమునందును మునగరసమునందును మాటి మాటికి భావన చేయవలయును. మునగవ్రేళ్లతోను కేతకీదళసఃపుటములతోను, చక్కగా పక్వము చేయవలయును. ఇట్లుచేసినయెడల శుద్ధమై కస్తూరితో సమానమైనది యగును. శిలాజిత్తును తేనెలో భావన చేయవలయును. కేసరిని ఘృతములో భావన చేయవలయును. లోహములను రక్తముతోటి భావన చేయవలయును, కచోరమును గోమూత్రముతోను సదాపను మధూదకము తోను భావన చేయవలయును. బియ్యపుకడుగుతో తేజపత్రిని భావన చేయవలయును. కొంచెమంత త్యాగపదార్థముతో కలసిన సదాపను తెగులఁ బెట్టినయెడల బూడిదెగాఁజాలదు. పచ్చనిదియును మొగలీఱేకలతో సమానముగా పరిమళించు నదియును కొంచెమంత చిక్కనిదియు నగునది యత్యుత్తమమైనది. వండినకర్పూరముకంటెను పచ్చకర్పూరము మిక్కిలి గుణమును కలిగించును. దానియందు కూడ నుక్షుద్రముగాక స్ఫటికమువలె తెల్లనైనది యత్యంతముత్తమము. మఱియును దళములు దళములుగా పక్వమై నునుపు తేలి పచ్చని రంగుగల కర్పూరము నుత్తమమైనది యగును. విడిపోయినప్పటికిని కణములు పడనిది మిక్కిలిశ్రేష్ఠము. లేడికొమ్ములవలె కొమ్ములుగానుండు కోష్ఠు ఉత్తమమైనది, ఎఱుపుపచ్చగలిగిన చందనము శ్రేష్ఠమైనది. కాకిముక్కువలె స్నిగ్ధమై బరువుగా నున్న యగురుత్తమమైనది. చిక్కగా నుండి కొద్దిపాటి కింజల్కములు గల కేసరి యుత్తమమైనది. గుండ్రముగను లావుగనుండు బియ్య ముత్తమము. పచ్చనిమరువము శ్రేష్ఠమైనది. జటామాంసి పచ్చనై జడవలె వెనవేసికొనినది యుత్తమము. పెసరగింజలవలె పలుకులు గానుండిన రేణుకయను ద్రవ్యము శ్రేష్ఠము. నీటిపట్టుల మొల చెడి తుంగముస్త శ్రేష్ఠము. మోగునదియును నున్ననైనదియు నగు జాజికాయ శ్రేష్ఠము. చిన్నగింజలుగల యేలకులు శ్రేష్ఠములు. నల్లగను పచ్చగనుండు కొష్టులు శ్రేష్ఠములు. రెండు తెలగులగు నఖమను ద్రవ్యములును గుజ్జుపుగిటులవలె నుండి నవియును ఏనుగు చెవివలె నుండునవియును శ్రేష్ఠములు. ఈపైనిచెప్పఁబడిన వస్తువులలోగాని యితరవస్తువులలోగాని నవత్వము (అనఁగా క్రొత్తందనము) మిక్కిలియైన గుణకరము అగుచున్నది.


మహాసుగంధితైల లక్ష్మీవిలాసతైలము.

శ్లో. జింగీ చోరక దేవదారుసరలం వ్యాఘ్రీవచాచోలక, త్వక్పత్ర స్పృహగంధపత్రకశఠీ పథ్యాక్షధాత్రీఘనైః, ఏతైః శోధితసంస్కృతైః పలయుగే త్యాఖ్యాతయా సంఖ్యయా, తైలప్రస్థ మవస్థితైః స్థిరమితి కల్కైః పచే ద్ధాంధికమ్. 274. మాంసీమురాదమనచంపక సుందరీత్వక్, గ్రంథ్యంబురుఙ్మరువకైః ద్విపలై స్సపుష్కైః శ్రీవాసకుందురున

33