भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 296, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 296

ఆంధ్రతాత్పర్యసహితము. 277

శుంఠీఘృతము.

శ్లో. నాగరక్వాథకల్కాభ్యాం ఘృతప్రస్థం విపాచయేత్, చతు
ర్గుణేన తేనాథ కేవలే నోదకేన వా. 46.
వాతశ్లేష్మప్రశమన మగ్నిసందీపనం పరమ్,
నాగరం ఘృత మిత్యుక్తం కట్వామశూలనాశనమ్. 47.

నాలుగురెట్లు శొంఠి కషాయము కల్కము వీటితో 16 పలముల నేతిని పక్వము చేసి గాని నీటితో పక్వము చేసి గాని సేవించిన వాతకఫము లడంగును. అగ్ని యుద్దీపించును. కటివాతామవాతములు నశించును.


గుడూచీఘృతము.

శ్లో. అమృతాయాః కషాయేణ కల్కేన చ మహౌషధాత్,
మృద్వగ్నినా ఘృతప్రస్థం వాతరక్తహరం పరమ్. 48.
ఆమవాతాఢ్యవాతాదీ న్క్రిమిదుష్టవ్రణా నపి,
అర్శాంసి గుల్మశూలం చ నాశయత్యాశు యోజితమ్. 49.

తిప్పతీగెకషాయము శొంఠి కల్కములయందు 16 పలముల నేతిని సన్ననిమంటపైని పక్వము చేసి సేవించిన వాతరక్తములు తప్పక నశించును. ఆమవాతము ఆఢ్యకవాతము మున్నగునవియును క్రిమిరోగము దుష్టవ్రణములు మూలరోగము శూల వీటిని నశింపఁజేయును.


కాంజికషట్పలఘృతము.

శ్లో. హింగు త్రికటుకం చవ్యం మాణీమన్థం తథైవ చ,
కల్కాన్కృత్వా చ పలికాన్ ఘృతప్రస్థం విపాచయేత్. 50.
ఆరనాలాఢకం దత్వా తత్సర్పిః జఠరాపహం,
శూలం విబంధ మానాహ మామవాతం కటీగ్రహమ్. 51.
నాశయే ద్గ్రహణీదోషం మందాగే ర్దీపనం పరమ్.

ఇంగువ శొంఠి మిరియములు పిప్పళ్లు చవ్యము సైంధవలవణము వీటినన్నిటి నొక్కొక్కపలముచొ॥ తెచ్చి కల్కమును చేసికొని 16 పలములనేతిలో పక్వమును చేయవలయును. మఱియును గంజి 64 పలములను కలిపి నేతిని సిద్ధముచేసి సేవింపవలయును. ఇయ్యది ఉదరరోగము శూల విబంధము అనాహము ఆమవాతము కటిగ్రహము అతిసారము మందాగ్ని వీటిని నశింపఁజేయును.