चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 299, कुल 674 में से
संदर्भ में पढ़ें280 చక్రదత్త—౨౫. ఆమవాతాధికారము.
నల్లఆవాలను 16 పలములు తెచ్చి పొట్టు తీసి కడిగి 16 పలముల మండములో మూడురోజులు అన్నముతో నుంచి పిమ్మట పైకితీసి చూచి చూర్ణముచేసి బోడసరము పల్లేరు సొంపు లవంగపుపట్ట శొంఠి ప్రసారిణీ ఉలిమిరి ఉష్మేత వీటినిజొక్కొక్క పలము చొప్పునఁ దీసికొని ఇందు పక్వముచేసి పాకమును బాగుగా తెలిసికొని బియ్యమును చేర్చి సిద్ధముచేయవలయును. ఆవనూనెతో సిద్ధముచేసిన ఇంగువ సైంధవలవణము నిందు కలిపి సేవించిన ఆమవాతములను జయించును. ఏకదోషజములు ద్విదోషజములు అసాధ్యములగు సన్నిపాతములం బుట్టినగుజ్వరములు కటివాతామవాతములు ఆనాహము మోకాళ్లవాతము కటిప్రాంతవాతము ఉదావర్తమనెడి వీనిని పోఁగొట్టును. బలమును తేజమును అగ్నిని దీపింపచేయును.
సిద్ధల.
శ్లో. త్వగాదిహీనాః సంశుష్కాః ప్రత్యగ్రా స్సకులాదయః,
శ్లక్ష్ణచూర్ణీకృతం తేషాం శీతే పలశతత్రయమ్. 70.
శతేన కటుతైలేస్య వ్యోష రామఠ ధాన్యకైః,
క్రిమిఘ్నదీప్యక నిశా చవికా గ్రంధికార్ద్రకైః. 71.
జీరకద్వయ వృశ్చీర సురసార్జక శిగ్రకైః,
దశమూలాత్మ గుప్తాభ్యాం మార్కవై ర్లవణై స్త్రిభిః. 72.
చూర్ణికైః పలికై స్సార్ధమారనాళపరిప్లుతైః,
విన్యసే త్స్నేహపాత్రే చ ధాన్యరాశౌ పునర్వసేత్. 73.
సప్తరాత్రా త్సముద్ధృత్య పానభక్షణభోజనైః,
సిద్ధ లేయం ప్రయోక్తవ్యా సామే వాతే విశేషతః. 74.
భగ్నరుగ్నాభ్యుపహతాః కంపినః పీఠసర్పిణః,
గృధ్రసీ మగ్నిసాదం చ శూలగుల్మోదరాణి చ,
వలీపలితఖాలిత్యం హత్వా స్యు రమలేంద్రియాః. 75.
పొట్టులేని ఎండిన కోష్ఠును క్రొత్తదానినితెచ్చి చూర్ణముచేసి 300 పలములు తీసి చల్లని కషాయమును చేయవలయును. ఆవనూనె 100 పలములు శొంఠి మిరియములు పిప్పళ్లు ఇంగువ ధనియములు వాయువిడంగములు కొడిసెపాలవిత్తులు పసుపు చెవ్యము మోడి అల్లము జీలకఱ్ఱ నల్ల జీలకఱ్ఱ తెల్లగల్లేరు తులసి మునగ దశమూలము క్రాంచవిత్తనములు దురదగొండి పంచలవణములు వీటినిపలము చొప్పునను కలిపి చూర్ణము చేసి గంజితో తడిపి చక్కనిపాత్రములో నుంచి అన్న రాశిలో నుంచవలయును. ఏడురోజులయినపిమ్ముటతీసి భక్షించుచుండవలయును. ఇయ్యది సిద్ధ లయనఁబడును. ఆమవాతమునందు భగ్నరుగ్నములగు వాతములయందునుహితకరము. మఱియును గృధ్రసీమందాగ్ని