भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 312, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 312

ఆంధ్రతాత్పర్యసహితము. 293

సాముద్రాద్యచూర్ణము.

శ్లో. సాముద్రం సైంధవం క్షారో రుచకం రోమకం బిడం,
దన్తీలోహరజః కిట్టం త్రివృచ్చూర్ణైకం సమం. 16. దధిగోమూత్రప
యసా మందపావకపాచితఁ, తద్వ్యథాగ్ని బలం చూర్ణం పిబే దుష్ణేన
వారిణా. 17. జీర్ణేజీర్ణేతు భుంజీత మాంసాది ఘృతసాధితం, నాభిశూ
లం యకృచ్చూలం గుల్మప్లీహకృతం చ యత్. 18. విద్రధ్యష్ఠీలికాం
హన్తి కఫవాతోద్భవాం తథా, శూలానా మపి సర్వేషా మౌషధం
నాస్తి తత్పరం, పరిణామసముత్థస్య విశేషేణా స్తకృ న్మతం. 19.

సాముద్రలవణము మున్నగు పంచలవణములు దంతి లోహచూర్ణము తెల్లతెగడ అడవికంద వీటిని సమానభాగములుగతెచ్చి, పెరుగు గోమూత్రము పాలు వీటితో సన్ననిసెగపై పక్వము చేసి అగ్నిబలము ననుసరించి ఆచూర్ణమును వేడినీళ్లతో త్రాగవలయును. జీర్ణించిన పిమ్మట నేతితో వండిన మాంససారమును భక్షింపవలయును. ఇయ్యది నాభిశూలము యకృచ్చూలము గుల్మము ప్లీహము విద్రధి అష్ఠీలికారोगము కఫశూల వాతశూలలను పోఁగొట్టుటకు సాటిలేని దివ్యమగు నౌషధము. అన్నివిధములగు శూలలకు నింతకంటె మంచిమందు లేదు. ఇయ్యది పరిణామశూలలను విశేషముగా పోఁగొట్టును.


సప్తామృతతైలము.

శ్లో. నారికేళం సతోయం చ లవణేన ప్రపూరితం, విపక్వ మ
గ్నినా సమ్య క్పరిణామజశూలనుత్. 20. వాతీకంపై త్తికం చైవ శ్లైష్మికంసా
న్నిపాతికం, మధుకం త్రిఫలాచూర్ణ మయోరజఃసమా లిహేత్. 21. మ
ధుసర్పిర్యుతం సమ్య గ్గవ్యం క్షీరం పిబే దను, ఛర్దిః సతిమిరా। శూలం
మమ్లపిత్తం జ్వరం క్లమం. 22. ఆనాహం మూత్రబంధం చ శోధం
చైవనిహన్తి సః.

కొబ్బరికాయలో నీళ్లలో సైంధవలవణమువైచి మూసి నిప్పుపై కాచి పక్వము చేసి సేవించిన పరిణామశూలలు నశించును. వాతపిత్తకఫసన్నిపాతములవలన నగు పరిణామశూలల నియ్యది పోఁగొట్టును. యష్టిమధుకము త్రిఫలములచూర్ణము లోహచూర్ణము సమానభాగములుగా గ్రహించి తేనెను నేతిని కలిపి సేవించుచు ఆవుపాలను త్రాగవలయును. ఛర్ది తిమిరి శూలము ఆమ్లపిత్తము జ్వరము గ్లాని ఆనాహము మూత్రబంధము వాపు మున్నగు వానిని పోఁగొట్టును.

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित) · पृष्ठ 312, कुल 674 में से · BharatKosha