चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 314, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్ర తాత్పర్యసహితము. 295
చవ్యము మోడి శొంతి పిప్పళ్లు యవక్షారము ఇవి ఒక్కొక్కపలమును మందూరము 16 పలంబులను నాలుగురెట్ల గోమూత్రములో కలిపి క్రమముగా పక్వము చేసి గట్టిపడిన పిమ్మట మాత్రలను కట్టవలయును. పిమ్మట వీనిని భోజనమున మొదలను నడుమను చివరలను మూడుమాత్రల చొ॥ తీసికొనవలయును. రసము నేయి యూషము పాలు మాంసము వీటిని భుజించుచున్న అన్నవివర్తనము గుల్మము ప్లీహరోగము మందాగ్ని వీటిని తొలగించును.
— క్షీరమండూరము. —
శ్లో. లోహకిట్టపలా న్యష్టౌ గోమూత్రాద్ధాఢకే పచేత్, క్షీరప్రస్థేన తత్సిద్ధం పక్తిశూలహరం నృణామ్. 30.
మండూరము 8 పలములు అర్థాఢకపు గోమూత్రములో పక్వముచేసి 16 పలముల పాలలో సిద్ధముచేసి సేవించిన పరిణామశూలలను పారద్రోలును.
— చవికాది మండూరము. —
శ్లో. లోహకిట్టపలా న్యష్టౌ గోమూత్రేష్టగుణే పచేత్, చవికా నాగరం క్షార పిప్పలీమూలపిప్పలీః. 31. సంచూర్ణ్య నిక్షిపే త్తస్మిన్పలాంశాః సాంద్రతాం గతే, గుడికాః కల్పయేత్తేన పక్తిశూలనివారిణీః. 32.
మండూరము 8 పలములను ఎనిమిది రెట్ల గోమూత్రములో పక్వము చేసి, చవ్యము శొంతి యవక్షారము మోడి పిప్పళ్ళు వీటి చూర్ణమును ఒక్కొక్క పలము కలిపి గట్టిపడిన పిమ్మట సేవించిన పరిణామశూలలను హరించును.
— శతావరీమండూరము. —
శ్లో. మండూరం శోధితం పత్రం లోహజం వా గుడేన తు,
భక్షయే న్ముచ్యతే శూలా త్పరిణామసముద్భవాత్. 33.
సంశోధ్యం చూర్ణితం కృత్వా మండూరస్య పలాష్టకమ్, శతావరీరస స్యాష్టౌ దధ్నస్తు పయస స్తథా. 34.
పలా న్యాదాయ చత్వారి తథా గవ్యస్య సర్పిషః, విపచే త్సర్వ మేకథ్యం యావత్పిండత్వ మాగతం. 35.
సిద్ధం తు భక్షయే న్మధ్యే భోజన స్యాగ్రతోఁపి వా, వాతాత్మకం పిత్తభవం శూలం చ పరిణామజం, 36.
నిహన్త్యేవ హి యోగోయం మండూరస్య న సంశయః.