भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 343, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 343

324 చక్రదత్త — ౩౧. మూత్రకృచ్ఛ్రాధికారము.

16 పలముల నేతిని సిద్ధముచేసి సేవించిన వాతపిత్తపుహృద్రోగము శూల మూత్రకృచ్ఛ్రము ప్రమేహము మూలరోగము శ్వాసము దగ్గు క్షయ వీటిని నశింపఁజేయును. ధనుస్సు స్త్రీలు కల్లు భారము దారినడక వీటివలన క్షీణించినవారికి బలమునిచ్చి కండరముల వృద్ధినొందించును.

బలాఘృతమును, నర్జునఘృతమును.

శ్లో. ఘృతం బలానాగబలార్జునాంబు సిద్ధం సయష్టీమధుకల్కపాదమ్,
హృద్రోగశూలక్షతరక్తపిత్త కాసాసిలాసృక్ శమయే త్వదీర్ఘం. 30.
పార్థస్య కల్కస్య రసేన సిద్ధం శస్తం ఘృతం సర్వహృదామయేషు.

ముత్తవపులగము పెద్దముత్తవపులగము మద్దిచెక్కరసము వీటితో యష్టిమధుకపుకల్కమును నాలవపాలుగా గలిపి ఘృతమును సిద్ధముచేసి సేవించిన హృద్రోగము శూల క్షయ రక్తపిత్తము దగ్గు వెచ్చుపెరిగిన వాతరక్తము ఇయ్యవి శాంతించును. అర్జునవృక్షపుచెక్క కల్కమును రసమును వీటితో సిద్ధముచేసిన నేయిఘృతము అన్నివిధములగు హృద్రోగములందును ప్రశస్తమని చెప్పబడినది.

ఇట్లు చక్రదత్తయందు హృద్రోగాధికార ప్రకరణము ముగిసెను.


౩౧. మూత్రకృచ్ఛ్రాధికారము.

అభ్యంగాద్యుపాయములు.

శ్లో. అభ్యంజన స్నేహ నిరూహవస్తి స్వేదోపనాహోత్తరవస్తిసేకాన్,
స్థిరాదిభి ర్వాతహరైశ్చ సిద్ధా న్సద్వాద్రసాం శ్చానిలమూత్రకృచ్ఛ్రే. 1.
అమృతాం నాగరం ధాత్రీ వాజిగంధా త్రికంటకాన్,
ప్రపిబే ద్వాతరోగార్తః సశూలీ మూత్రకృచ్ఛ్రవాన్. 2.
సేకావగాహాః శిశిరాః ప్రదేహా గ్రైష్మోవిధిర్వ్యస్తిపయోవికారాః,
ద్రాక్షావిదారీక్షురసైః ఘృతైశ్చ కృచ్ఛ్రేషు పిత్తప్రభవేషు కార్యాః. 3.
కుశఃకాశఃశరోదర్భ ఇత్యుచ్ఛేతి తృణోద్భవం, పిత్తకృచ్ఛ్రహరం పంచమూలం వస్తిశోధనం,
ఏతత్సిద్ధం పయః పీతం మేఢ్రగం హన్తి శోణితం. 4.