भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 422, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 422

ఆంధ్రతాత్పర్యసహితము. 399

చిరోత్థా శ్చ యే వ్రణాః, విషమా మపి నాడీం చ శోధయే చ్ఛీఘ్ర
మేవ చ. 77. గౌరాద్యం జాతీకాద్యంచ తైల మేవం ప్రసాధ్యతే, తై
లం సూక్ష్మాననే దుష్టే వ్రణే గంభీర ఏవ చ. 78.

గోరోజనము పసపు మంజిష్ఠ జటామాంసి మధుకము తెల్లకమలములు కురువేరు భద్రముస్తలు చందనము జాజి నింబము చేదుపొట్ల నెమలిఅడుగు కటుకరోహిణి మైనము మధుకము మహామొద పంచవల్కలములు వీటిని కషాయముచేసి అందొక ప్రస్థము నేతిని పక్వముచేసి సేవించవలయును. ఇయ్యది మహావీర్యసమన్వితమగు గౌరఘృతము అనఁబడును. ఆగంతకములను సహజములును ప్రాచీనములునగు గాయములనుమాన్పి విషమరూపమలగు నాడులను మిక్కిలి శీఘ్రముగా శోధించును. గౌరాద్యజాతీకాద్యతైలములు ఈవిధముగనే సిద్ధమగును. సూక్ష్మముఖములను దుష్టములును గంభీరములునగు వ్రణములకు ఇయ్యవి హితకరములు.

౦ కరంజాద్యఘృతము. ౦

శ్లో. నక్తమాలస్య పత్రాణి వారుణాని ఫలాని చ, సుమనాయా
శ్చ పత్రాణి పటోలారిష్టయో స్తథా. 79. ద్వే హరిద్రే మధూచ్ఛిష్టం
మధుకం తిక్తరోహిణీ, మంజిష్ఠా చందనోశీర ముత్పలం శారిబే త్రివృ
త్. 80. ఏతేషాం కార్షికై ర్భాగై ర్ఘృతప్రస్థం విపాచయేత్, దు
ష్టవ్రణ ప్రశమనం తథా నాడీవిశోధనం. 81. సద్యశ్ఛిన్నవ్రణానాంచ క
రంజాద్యమి హేష్యతే. 82.

నెమలిఅడుగుఆకులను ఉలిమిరి పొళ్ల వేపఆకులను పసపు మ్రానిపసపు మైనము మధుకము కటుకరోహిణి మంజిష్ఠము చందనము వట్టివేళ్లు తెల్లకమలములు రెండు విధములగు మనుబాలలను తెల్లతెగడ వీటితో ఒక్కొక్కతులము చొప్పున 16 పలముల నేయిని పక్వము చేసి దుష్టవ్రణములను శాంతినొందింపవలయును. ఇయ్యది నాడీవ్రణములను శోధించును. తత్కాలక్షతములనుకూడ పోఁగొట్టును.

౦ ప్రపౌండరీక తైలము. ౦

శ్లో. ప్రపౌండరీక మంజిష్ఠా మధుకోశీర పద్మకైః, సహరిద్రై
శ్శృతం సర్పి స్సక్షీరం వ్రణరోపణమ్. 83.

కమలములు మధుకము కాకోలి క్షీరకాకోలి చందనము వీటితో సిద్ధముచేసిన తైలము గాయములను మాన్పి క్షతుల చర్మమును పుట్టించుటయందు మిక్కిలి శ్రేష్ఠము.