चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 455, कुल 674 में से
संदर्भ में पढ़ें434 చక్రదత్త—ర౯. కుష్ఠాధికారము.
శ్విత్ర విస్ఫోటకిటిభ కీటలూతా విచర్చికాః, కండూకచ్ఛువికారా శ్చ యే వ్రణా విషదూషితాః. 152. విషతైల మిదం నామ్నా సర్వవ్రణవిశోధనం.
నెమలిఅడుగు పసుపు మ్రానిపసుపు జిల్లేడు తగరము గన్నేరు వస కోష్ఠు తెల్లమనుబాల రక్తచందనము జాజి సప్తపర్ణము మంజిష్ఠ వావిలి వీటి నర్ధపలమంతయును పొన్నతైలము నొకపలమును నాలుగురెట్లు గోమూత్రమును వీటితో 16 పలముల తైలమును పక్వముచేసి వాడిన శ్విత్రకుష్ఠానలను పోగొట్టును.
కరవీరతైలము.
శ్లో. శ్వేతకరవీరరసో గోమూత్రం చిత్రకం విడంగం చ, కుష్ఠేషు తైలయోగః సిద్ధోయం సమ్మతో భిషజాం. 153.
తెల్లగన్నేరురసము గోమూత్రము చిత్రమూలము వాయువిడంగములు వీటిలో సిద్ధముచేసిన తైలము కుష్ఠుల నన్నిటిని పోగొట్టును.
తెల్లగన్నేరు తైలము.
శ్లో. శ్వేతకరవీరమూలం విషాంశసాధితం గవాం మూత్రే, చర్మదళపామా సిద్ధవిస్ఫోట క్రిమికిటిభజి త్తైలం. 154.
తెల్లగన్నేరువేళ్లు పొన్నతైలము వీటిని గోమూత్రములో సాధించి లేపనచేసినచో పామాదిరోగములు నశించును.
సిందూరాదితైలము.
శ్లో. సిందూరార్ధపలం పిష్ట్వా జీరకస్య పలం తథా, కటుతైలం పచే న్నాసీం సద్యః పామాహరం పరం. 155.
సిందూరము అరపలము జీలకఱ్ఱపలము వీటిని 8 పలముల ఆవనూనెతో పక్వము చేసి యుపయోగించినచో తత్క్షణమే పామను పోగొట్టును.
మహాసిందూర తైలము.
శ్లో. సిందూరం చందనం మాంసీ విడంగం రజనీద్వయం, ప్రియంగుం పద్మకం కుష్ఠం మంజిష్ఠాం ఖదిరం వచాం. 156. జాత్యర్కత్రివృతానింబ కరంజవిష మేవ చ, కృష్ణవేత్రక్రలోధ్రం చ ప్రపున్నాడం చ సంహరేత్. 157. శ్లక్ష్ణపిష్టాని సర్వాణ్యే యోజయే త్తైలమాత్రయా, అభ్యంగేన ప్రయుంజీత సర్వకుష్ఠవినాశనం. 158. పామావిచర్చి...