चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 47, कुल 674 में से
संदर्भ में पढ़ें26 చక్రదత్త — ౧. జ్వరాధికారము.
వత్, మాషికం హింగుసింధూత్థం జీరణాద్భ్యాస్తు శాణికాః. 147. మాతులంగఫల కేసరో ధృతః సింధుజన్మ మరీచాన్వితో ముఖే, హంతి వాతకఫరోగ మాస్యగం శోష మాశు జడతా మరోచకం. 148.
కఫవాతజ్వరము, అజీర్ణము, అతినిద్ర, పార్శ్వపుతల నొప్పి, అధికముగా శ్వాసమువెడలుట, దగ్గు దీనియందు అనగా నివి సంభవించినప్పుడు దశమూలమును కషాయముపెట్టి ఆ కషాయమునందు పిప్పళ్లను పొడిచేసి వైచి త్రాగింపవలయును. తుంగముస్తలు, పర్పాటకము, శొంఠి, తిప్పతీగె, చిన్నదూలగొండి దీనినికషాయము చేసి ఇచ్చినయెడల కఫమును, వాతమును, అరుచిని, ఛర్దిని, దాహమును, గొంతు ఎండిపోవుటను, ఇట్టి గుణములుగల జ్వరమును అణచివైచును. దేవదారువు, పర్పాటకము, గంటుభారంగి, తుంగముస్తలు, వస, ధనియములు, గుమ్ముడు, కరక్కాయలు, శొంఠి, నేలవేము వీటితోఁ జేయఁబడిన కషాయములోఁ దేనెను ఇంగువను కలిపి త్రాగిన కఫవాతజ్వరములు నశించును.
ఈకషాయము వెక్కిళ్లను, శ్వాస మెక్కువగా వెడలుట, గొంతుక పట్టుకొనుట, దగ్గు, గొంతెండిపోవుట, ప్రసేకము అనునీదోషములను పోఁగొట్టును, పిడుగు వృక్షములను కూల్చునట్లు పైరోగముల నీకషాయము మొదలంట నశింపఁజేయును. తేనె, నెయ్యి మొదలగువాని మాత్రప్రమాణములను తైలమనందు కషాయమునందు చూర్ణములలాగుననే యెఱుంగవలయును. మరియును ఇంగువ, సైంధవలవణము, ఒక్కొక్కమాషప్రమాణమును, జీలకఱ్ఱ పిప్పళ్లు మొదలయినవి నాలుగుమాషముల యెత్తున కలపవలయును. మాదీఫలము, కింజల్కములు, సైంధవలవణము, మిరియములు వీటినికలిపి నోటను ధరించుకొనినయెడల వాతకఫములవలన బుట్టుచుండెడి గొంతుకయెండిపోవుట, మొద్దుపాఱుట, అసహ్యము మున్నగునవి అతిశీఘ్రముగా నశించిపోఁగలవు. ఇచ్చట కలిసిన దోషములవలన కలుగుచుండెడి జ్వరమునకు చేయఁదగిన చికిత్స ముగిసినది.
[సన్నిపాతజ్వరచికిత్స; త్రిదోషజ్వరచికిత్సారంభ క్రమము; సన్నిపాతమునందు లంఘనరీతి; సన్నిపాతమునందు నిష్ఠీవనము; సన్నిపాతమున నస్యవిధి.]
శ్లో. లంఘనం వాలుకాస్వేదో నస్యం నిష్ఠీవనం తథా, అవలేహాంజనంచైవ ప్రక్ప్రయోజ్యం త్రిదోషజే. 149. సన్నిపాతజ్వరే పూర్వం కుర్యా దామకఫాపహం, పశ్చా చ్ఛ్లేష్మణి సంక్షీణే శమయే