भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 46, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 46

ఆంధ్ర తాత్పర్యసహితము. 25

యః, సామే సశూలే కఫవాతయుక్తే జ్వరే హితో దీపనపాచనశ్చ . 141.

పిప్పళ్లు, పిప్పలీమూలము, (పిప్పలి, మోడి,) చవ్యము, చిత్రమూలము, శొంఠి ఇవి పంచమూల మని చెప్పఁబడును. ఈపంచమూలముల కషాయము జఠరాగ్నిని వృద్ధిని బొందించును. కఫసంబంధములయిన వాతసంబంధములయిన రోగములను నిశ్శేషముగా బోఁగొట్టును. పిప్పళ్లకషాయము కఫమును బుట్టింపదు. జఠరాగ్నిని వృద్ధి నొందించును. వాతకఫమువలనను శ్లేష్మవికారమువలనను కలిగినరోగములను నశింపఁజేయును. రేలచెక్క, పిప్పలిదుంప, మోడి, తుంగముస్తలు, కటుకరోహిణి, కరక్కాయలు వీటితో సమభాగములుగా చేయఁబడిన కషాయము, ఆమశూలముచేతను కఫవాతముల తోను కూడిన జ్వరములను పోఁగొట్టుటయందు శ్రేష్ఠమైనది.


క్షుద్రాదిగణః

శ్లో. క్షుద్రామృతా నాగరుపుష్కరాహ్వయైః
కృతః కషాయః కఫమారుతోద్భవే,
సశ్వాస కాసారుచి పార్శ్వరుక్కరే
జ్వరే త్రిదోషప్రభవే చ శస్యతే. 142

తా. మూలక, తిప్పతీగ, శొంఠి, పుష్కరమూలము వీనిని కషాయముగాఁ గాచి పుచ్చుకొనినయెడల కఫవాతములవలనఁ బుట్టిన జ్వరములను, శ్వాస, దగ్గు, అరుచి, పార్శ్వపునొప్పి మొదలగు లక్షణములు గల త్రిదోషములవలన బుట్టిన జ్వరమును నశింపఁజేయును.


{ కఫాదిజ్వరములకు దశమూలీరసము; ముస్తాదికషాయము; దేవగారవ్యాదిక్వాథము; మాతులంగాదికల్కము. }

శ్లో. దశమూలీరసః పేయః కణాయుక్తః కఫానిలే, అవిపాకేఽతినిద్రాయాం పార్శ్వరుక్కాసశ్వాసకే. 143.

ముస్తం పర్పటకశ్శుంఠీ గుడూచీ సుదురాలభా, కఫవాతారుచి చ్ఛర్ది దాహ శోష జ్వరాపహః. 144.

దారుపర్వటభార్ఙ్గ్యబ్ద వచాధాన్యకకట్ఫలైః, సాభయా విశ్వభూతికైః క్వాథో హింగుమధూత్కటః. 145.

కఫవాతజ్వరే పీతో హిక్కా శ్వాసగలగ్రహాన్, కాసశోష ప్రసేకాంశ్చ హన్యాత్త్రుమివాశనిః. 146.

మాత్రాశ్చాద్రుశ్రుతాదీనాం స్నేహ క్వాథేషు చూర్ణ

4