चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 45, कुल 674 में से
संदर्भ में पढ़ें24 చక్రదత్త—౧. జ్వరాధికారము.
కఫవాతజ్వరే స్వేదాన్ కారయే ద్రూక్షనిర్మితాన్, స్రోతసాం మార్దవం కృత్వా నీత్వా పావకమాశయం. 136. హత్వా వాతకఫస్తంభం స్వేదో జ్వర మపోహతి. ఖర్పరభృష్ట పటస్థిత కాంజికసిక్తో హి వాలుకాస్వేదః, శమయతి వాతకఫామయ మస్తకశూలాంగభంగాదీన్. 137. ముస్తానాగర భూనింబ త్రయ మేతత్తికార్షికం, కఫవాతా22మ శమనం పాచనం జ్వరనాశనమ్. 138.
చక్కరతో కలిసిన కటుకరోహిణిని ఒక్కొక్క అర్థకర్షముగా చేకొని వేడినీళ్ల తోకూడ త్రాగినయెడల కఫజ్వరములును, పిత్తజ్వరములును, వాతపిత్తజ్వరములును నశించిపోవును.
ధనియములు, చేదుపొట్ల వీటికషాయము జఠరాగ్నిని దీపింపజేయును. కఫమును బోఁగొట్టును. వాతపిత్తములకు సమానత్వమును కలుగఁజేయును. జ్వరమును పోఁగొట్టును. ఆహారాదులను పక్వముచేయును. భేదిని కలిగించును.
కఫము వాతము మున్నగువానిచే వచ్చిన జ్వరములయందు రూక్షపదార్థములవలన చెమ్మట కలుగునట్లు రక్తనాదులను శుభ్రపఱచి, మృదువుగాచేసి జీర్ణకోశమునందలి యగ్నిని వృద్ధిపొందించునట్లు చేయవలయును. వాతము కఫము అను వీటి యవరోధములను గూలద్రోసి జ్వరమును పోఁగొట్టగలదు. పెనముపైనఁగాని మూఁకుడులోఁగాని ఇసుకను వేయించి కాచి తరువాత దానిని ఒక గుడ్డయందు కట్టి గంజిలో ముంచి దానిచేత యొడలిని తడపవలయును. దీనిపేరే వాలుకాస్వేదము. ఈవాలుకాస్వేదము వాతరోగములను, కఫరోగములను, తలనొప్పిని, కాళ్లుచేతులు లాగుటను ఈమొదలగు బాధలను అణఁచివేసి సౌఖ్యము నీయఁగలదు.
తుంగముస్తలు, శొంఠి, నేలవేము ఈమూఁడువస్తువులను పలముచొప్పున తీసికొని కాచి ఆకషాయము నిచ్చినచో కఫమును, వాతమును, ఆమమును తగ్గించివైచును. పాచనముగూడ నగును. జ్వరము నణచివేయును.
కఫవాతజ్వరములకై పంచకోలకషాయము; పిప్పలీశృతము; ఆరగ్వధాదిక్వాథము.
శ్లో. పిప్పలీ పిప్పలీమూల చవ్యచిత్రకనాగరం, దీపనీయః స్మృతో వర్గః కఫానిలగదాపహః. 139. పిప్పలీభి శ్శృతం తోయం అనభిష్యంది దీపనం, వాతశ్లేష్మవికారఘ్నం ప్లీహజ్వర వినాశనం. 140. ఆరగ్వధగ్రంథికముస్తతిక్తా హరీతకీభిః క్వథితఃకషాయః,