भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 492, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 492

ఆంధ్రతాత్పర్యసహితము. 471

संस्कृत श्लोकाः

पक्वैक्ये नारिकेले भृङ्गराजरसान्विते, मासमेकन्तु निक्षिप्य सम्यग्गर्भां त्समुद्धरेत् ॥ १०७ ॥ ततश्शिरो मुण्डयित्वा लेपन्दद्या द्भिषग्वरः, संवेष्ट्य कदलीपत्री रोचये त्सप्तमेदिने ॥ १०८ ॥ क्षालये त्त्रिफलाक्वाथैः क्षीरमांसरसाशिनः, कपाल रञ्जनं चैत त्कृष्णीकरण मुत्तमम् ॥ १०९ ॥ उत्पलं पयसा सार्धं मासं भूमौ निधापयेत्, केशानां कृष्णकरणे स्नेहनञ्च विधीयते ॥ ११० ॥ भृङ्गपुष्पञ्जसा पुष्पं मेषीदुग्धप्रपेषितं, तेनैवालोडितं लोहपात्रस्थं भूम्यधःकृतं ॥ १११ ॥ सप्ताहादुद्धृतं पश्चा द्भृङ्गराजरसेन तु, आलोड्याभ्यज्य च शिरो वेष्टयित्वा वसेन्निशां ॥ ११२ ॥ प्रातस्तु क्षालनं कार्य मेवं स्या न्मूर्धरञ्जनम्, एवं सिन्दूर वालाम्ब शङ्खभृङ्गरसैः क्रिया ॥ ११३ ॥


ఆంధ్ర తాత్పర్యము

అతిమధురము మధుకము ఉసిరిక వీటితో పక్వము చేసినపాలతో నైన క్వాథముఁదు సిద్ధముచేసిన తైలమును నస్యముగా నిచ్చుట చేత తలకును గడ్డమునకును వెంట్రుకలు మొలచును. త్రిఫలములు నీలియాకులు గుంటకలగరాకు పొడి వీటినిస మానభాగములను ఆడు మేక మూత్రముతో నూరి వెంట్రుకలకు పట్టించిన నల్లబడును. కొంచెముగా పక్వమైన కొబ్బరి కాయలో (మండూరను) లోహచూర్ణమును త్రిఫలముల చూర్ణమును పోసి దానియందు గుంటకలగరాకు పసరును పోసి మూతిని మూసి ఒక నెలరోజులుంచి తరువాత వైద్యుడగువాడు తలసుక్షౌరము చేయించి దీనిని పూసి అరటిఆకులతో చుట్టికట్టి ఏడుదినములైన పిమ్మట విప్పవలయును. తరువాత త్రిఫలముల కషాయముతో కడుగవలయును. పాలు మాంసరసము నాహారముగా పెట్టింపవలయును. ఇయ్యది కపాలమును రంజింపచేసి వెంట్రుకలను నల్లపఱచును. కలువను పాలతో నొక నెలరోజులు భూపుటమును వేయవలయును. తరువాత తీసి నూరిపట్టించిన శిరోజములు నల్ల పడును. గుంటకలగరాకు పువ్వుజపాపుష్పము వీటిని ఆడుమేకపాలతో నూరి ఇనుపపాత్రలో పోసి భూమిలో పాతిపెట్టి ఏడు రోజులుంచి తీసి గుంటకలగరాకు పసరును కలిపి సాయంకాలమునందు శిరస్సునకు లేపనచేసి ప్రాతఃకాలమునందు కడుగుచుండవలయును. ఇదేవిధముగా సిందూరను శంఖపుష్పము గుంటకలగరాకు వీటిరసములతోటియును చికిత్సలను చేయువలయును.