चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 545, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్రతాత్పర్యసహితము. 525
వేసికొనిన హితకరము. శంఖము ముద్గములు సముద్రఫేనము మణిశిల మిరియములు వీటిని వత్తిచేసి వేయుట మంచిది. లేనిచో రసాంజనము నేయి తేనె తాడిశపత్రి స్వర్ణగైరికము వీటిని నూరి పేడరసములో కలిపి వత్తిని చేసి ఆవత్తితో పిత్తోపహతములగు దృష్టులు శాంతించును.
గుటికాంరజనము.
శ్లో. నలినోత్పలకింజల్కం గోశకృద్రససంయుతం. 171. గుడికాంరజన మేత త్స్యాద్దినరాత్రాంధయో ర్హితం, నదీజశంఖుత్రికటూర్వ్యథాంజనం మనఃశిలా ద్వే చ నిశే గవాం శకృత్, సచందనేయం గుడికాథ చాంజనే ప్రశస్యతే రాత్రిదినే ష్వపశ్యతాం. 172. కణా చ్ఛాగయకృన్మధ్యే పక్త్వా తద్రసపేషితా, అచిరాద్ధంతి నక్తాంధ్యం తద్వ త్క్షౌద్రమూషణం. 173. పచేత్తు గోధాం హి యకృత్ర్పయుక్తం ప్రకల్పితం మాగధికాభి రంజనా, న్నిషేవితం తస్యకృ దంజనేన నిహంతి నక్తాంధ్య మసంశయం ఖలు. 174. దధ్నా నిఘృష్టం మరిచం రాత్య్రాంధ్యాంజన ముత్తమం, తాంబూలయుక్తం ఖద్యోతభక్షణం చ తదర్థకృత్. 175. శఫరీమత్స్యక్షారో నక్తాంధ్యం చాంజనా ద్వినిహంతి, తద్వ ద్రామఠ టంకణ కర్ణమలం చైకశోంజనా న్మధునా. 177. కేశరాజన్వితం విద్ధం మత్స్యాండం హస్తి భక్షితం, నక్తాంధ్యం నియతం నృణాం సప్తాహ త్పథ్యసేవినాం. 177.
కమలకేసరములను ఆవుపేడలోకలిపి ఉండలుచేసి కంటిలొ నుంచికొనిన పగలు దృష్టి చక్కగా నగపడును. రేచీకటియు నశించును. అత్యుత్పన్నమగు శంఖము శొంఠి మిరియములు పిప్పళ్లు అంజనము మణిశిల పసపు మ్రానిపసపు పేడ చందనము వీటిని వత్తి చేసి కంటిలో వేసికొనిన దివారాత్రములును దృష్టిస్వచ్ఛముగా నుండును. పిప్పళ్లను మేకకడుపులో (కుడిదిక్కుననున్న) మాంసమునందు పక్వముచేసి కంటిలో వైచికొనిన నిశ్చయముగా రేచీకటులు నశించును. మిరియమును పెరుగులలో నూరి కాటుకగా వేసికొన రేచీకటులు నశించును. తాంబూలములో మిణుగురుపురువును తినినను చేపయొక్క క్షారమును కంటిలొ వేసికొనిన రేచీకటులు నశించును. ఇంగువ సుహాగపువ్వును చెవిగుబిలి వీటి నొక్కొక్కదానిని తేనెతో చాది వేయుట మంచిది.