भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 606, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 606

586 చక్రదత్త—౬౧. రసాయనాధికారము.

దుండిగపురసమును మధుకచూర్ణమును పాలతో ప్రయోగింపవలయును. ముల్లంగిరసము తిప్పతీగెరసములతో శంఖపుష్పీకల్కమును చేసి ప్రయోగింపవలయును. నేతితో తైలముతో లేక వేడినీటితో సేవించిన కృశశరీరము పుష్టమగును. ఉసిరిక తిలలు గుంటకలగరచూర్ణము వీటిని కలిపి క్రమముగా సేవించువాఁడు నల్లని కురులు గలిగి స్వచ్ఛములగు నింద్రియములు కలవాడై వ్యాధిరహితుడై నూరేండ్లు జీవించును.

☛ వృద్ధదారక చూర్ణము. ☚

శ్లో. వృద్ధదారకమూలాని శ్లక్ష్ణచూర్ణాని కారయేత్, శతావర్యా
రసేనైవ సప్తరాత్రాణి భావయేత్. 16. అక్షమాత్రం తు తచ్చూర్ణం సర్పిషా
సహ భోజయేత్, మాసమాత్రోపయోగేన మతిమాన్ జాయతే నరః. 17.
మేధావీ స్మృతిమాంశ్చైవ వలీపలితవర్జితః, హస్తికర్ణరజః ఖాదేత్ర్ప
భాత ఉత్థాయ సర్పిషా. 18. యథేష్టాహారాచారోఽపి సహస్రాయుర్భవే
న్నరః, మేధావీ బలవాన్కామీ స్త్రీశతాని వ్రజత్యసౌ. 19. మధు
నా త్వశ్వవేగః స్యాద్బలిష్ఠః స్త్రీసహస్రగః, మంత్రశ్చాయం ప్ర
యోక్తవ్యో భిషజా చాభిమంత్రణే. 20. “ఓం నమో మహావినాయ
కాయ అమృతం రక్ష రక్ష మమ ఫలసిద్ధిం దేహి రుద్రవచనేన స్వాహా.”

వృద్ధదారకపు వేళ్లను చక్కగా పొడిచేసి శతావరిరసముతో నేడురాత్రులు భావనచేసి అక్షమాత్రమును నేతితో నెలరోజులు సేవించినచో బుద్ధిమంతుఁడగును. మేధావియును స్మృతిమంతుఁడును తలనెఱుపులేనివాఁడుగను అగును. ప్రొద్దున లేచి ఆడుదపు చూర్ణమును నేతితోగాని హస్తికందచూర్ణమును గాని తిని మనోవాంఛితమగుభోజనముఁ జేసినచో వేయేండ్లు ఆయుష్కుఁడగును. ఉత్తమబుద్ధి గలవాఁడుగను, బలిష్ఠుఁడుగను కామిగను అగును. తేనెతో కలిపి త్రాగినగుఱ్ఱమువంటి వేగముకలవాఁడుగను అధికమగు బలము కలవాఁడుగను వేలస్త్రీలతో భోగించువాఁడుగ నగును. వైద్యుడు నభిమంత్రించుటలో ఓంనమో మహావినాయకాయ యను మంత్రము నుపయోగింపవలెను.


☛ ఉసిరిక తిప్పతీగెలచూర్ణము. ☚

శ్లో. ధాత్రీచూర్ణస్య కర్షం స్వరసపరిగతం క్షౌద్రసర్పిఃసమాం
శం, కృష్ణామానీసితాప్తా ప్రసృతయుత మిదం స్థాపితం భస్మరాశౌ. 21.
వర్షాంతే తత్సుమశ్న న్భవతి విఫలితో రూపవర్ణప్రభావై, ర్గిర్వాణాధీ